రానా-మిహీకా పెళ్లి తేదీ ఫిక్స్

హీరో దగ్గుబాటి రానా-మిహీకా బజాబ్ పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 8న పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు

  • Published By: naveen ,Published On : June 10, 2020 / 12:51 PM IST
రానా-మిహీకా పెళ్లి తేదీ ఫిక్స్

Updated On : June 10, 2020 / 12:51 PM IST

హీరో దగ్గుబాటి రానా-మిహీకా బజాబ్ పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 8న పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు

హీరో దగ్గుబాటి రానా-మిహీకా బజాబ్ పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 8న పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం(జూన్ 10,2020) అధికారికంగా వెల్లడించారు. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లోనే వివాహాన్ని జరపనున్నారు. ఈ మేరకు దగ్గుబాటి, బజాజ్ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి తంతు మూడు రోజులపాటు నిర్వహించబోతున్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించబోతున్నారు. కరోనా ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ఈ వేడుకని నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. కాగా, నిశ్చితార్థం నిర్వహించకుండా నేరుగా పెళ్లి చేయబోతున్నారు.

రానా దగ్గుబాటి కొద్ది రోజుల క్రితం తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. రానా తండ్రి సురేష్‌ బాబు కూడా ఈ విషయాన్ని కన్‌ఫాం చేస్తూ ఆగస్ట్‌ 8న పెళ్లి ఉండనుందంటూ చిన్న హింట్ ఇచ్చారు. అభిమానులు కూడా తమ అభిమాన హీరో వివాహం ఆగస్ట్‌లో ఉంటుందని భావించారు. అంతలోనే నా వివాహం వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లిని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని రానా కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఇరు కుటుంబాలు క్లారిటీ ఇచ్చాయి. ఆగస్టు 8వ తేదీనే పెళ్లి జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. కొద్ది రోజుల క్రితం మిహీకా కుటుంబ సభ్యులు ముంబై నుండి హైదరాబాద్‌కి రాగా, రామానాయుడు స్టూడియోలో రోకా వేడుకని నిర్వహించారు. ఈ వేడుకలో రానా, మిహీకాలు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.