MUMBAI : తుఫాన్ వేళ..కూలిన చెట్టుపై దీపిక ఫొటో షూట్

MUMBAI : తుఫాన్ వేళ..కూలిన చెట్టుపై దీపిక ఫొటో షూట్

Deepika

Updated On : May 19, 2021 / 1:35 PM IST

Uprooted Tree : తౌటే తుఫాన్ కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. ప్రధానంగా కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని పేరొందిన ముంబైపై కూడా తుఫాన్ ఎఫెక్ట్ పడుతోంది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద భారీగానే నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో వేర్లతో సహా చెట్లు నేలకూలాయి. ఇదంతా ఒకే..కానీ..టీవీ నటి దీపికా సింగ్ చేసిన ఫొటో షూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కూలిన చెట్టుపై ఆమె చేసిన ఫొటోషూట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

దీపికా సింగ్ గోయల్ నివాసం ఉంటున్న ఇంటి వద్ద ఓ చెట్టు తుఫాన్ ధాటికి నేలకూలింది. నేల‌రాలిన ఆ చెట్టు వ‌ద్ద‌.. దీపికా సింగ్ ఫోటోషూట్ చేసింది. నేలకూలిన చెట్టుతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగ లేదని చెబుతూ…వెరైటీ ఫోజుల్లో ఆమె ఫొటో షూట్ చేసింది. తుఫాన్‌ను ఆప‌లేమ‌ని, ఆ ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దు అని..మ‌నం ప్ర‌శాంతంగా మారి, ఆ ప్ర‌కృతిని ఎంజాయ్ చేయాల‌ని త‌న పోస్టుకు క్యాప్ష‌న్ ఇచ్చింది.

రెండో ఫొటోకు కూడా క్యాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తుఫాన్ పోయే వ‌ర‌కు వేచి ఉండ‌డం కాదు అని, ఆ వ‌ర్షంలో డ్యాన్స్‌ను చేయాల‌ని వెల్లడించింది. తుఫాన్ వేళ ఏంటీ ఈ ఫోజులు అంటూ కొంతమంది నెటిజన్లు రియాక్ట అయితే..మరికొందరు లైక్ కొడుతున్నారు. దియా ఔర్ బాతి హ‌మ్ సీరియ‌ల్‌లో దీపిక సింగ్ నటిస్తోంది.

Read More :  Tigers at kapila theertham : కపిలతీర్థంలో చిరుతల సంచారం

 

View this post on Instagram

 

A post shared by Deepika Singh Goyal (@deepikasingh150)