Crocodile gnawing man’s body: యువకుడిని నీటిలోకి ఈడ్చుకువెళ్ళి కొరికి చంపిన మొసలి
ఓ యువకుడిపై మొసలి దాడిచేసి చంపేసింది.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఆ దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. మొసలి దాడిలో చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది.

Gujarat: Huge crocodile spotted gnawing man's body in Dhadhar river, video goes viral crocodile gnawing man's body: యువకుడిని నీటిలోకి ఈడ్చుకువెళ్ళి కొరికి చంపిన మొసలి crocodile gnawing man's body
Crocodile gnawing man’s body: ఓ యువకుడిపై మొసలి దాడిచేసి చంపేసింది.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఆ దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. మొసలి దాడిలో చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. పద్రా తాలూకాలోని సోఖ్దారఘు గ్రామానికి సమీపంలో ధధర్ నదిలో ఇమ్రాన్ దివాన్ (30) అనే వ్యక్తి స్నానానికి దిగాడు.
ఆ సమయంలో అతడిని ఓ మొసలి ఒక్కసారిగా నీళ్ళలోకి లాక్కువెళ్ళింది. ఆ తర్వాత అతడిపై మొసలి దాడి చేయడం ప్రారంభించింది. ఈ దృశ్యాలను స్థానికులు స్మార్ట్ ఫోన్లలో తీశారు. స్థానిక అధికారులకు వారు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సహాయక సిబ్బంది నదిలో ఇమ్రాన్ దివాన్ కోసం వెతకడం ప్రారంభించారు.
కొన్ని గంటల తర్వాత అతడి మృతదేహం నీళ్ళలో లభ్యమైందని అధికారులు మీడియాకు తెలిపారు. ఇమ్రాన్ దివాన్ సోఖ్దారఘు గ్రామంలో ఉండేవాడని వారు వివరించారు. అతడి మృతదేహంపై గాయాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.