Priyanka Gandhi Slams BJP: మహిళపై దాడి చేసిన బీజేపీ నేత ఇంటిని కూల్చేసిన అధికారులు.. ప్రియాంకా గాంధీ ఆగ్రహం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో ఇటీవ‌ల‌ ఓ మహిళపై బీజేపీ నేత శ్రీకాంత్‌ త్యాగి దాడి చేయ‌డంతో ఇవాళ ఆయ‌న అక్ర‌మ ఇంటిని బుల్డోజ‌ర్ల‌తో కూల్చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు అధికారులు ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే, ప్ర‌భుత్వ తీరుపై కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ మండిప‌డ్డారు. నోయిడాలోని ఆ బీజేపీ నేత అక్ర‌మంగా ఇళ్ళు క‌ట్టుకున్నార‌న్న విష‌యం ఇన్నేళ్ళుగా బీజేపీకి తెలియ‌దా? అని ప్రశ్నించారు.

Priyanka Gandhi Slams BJP: మహిళపై దాడి చేసిన బీజేపీ నేత ఇంటిని కూల్చేసిన అధికారులు.. ప్రియాంకా గాంధీ ఆగ్రహం

Priyanka Gandhi Slams BJP

Priyanka Gandhi Slams BJP: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో ఇటీవ‌ల‌ ఓ మహిళపై బీజేపీ నేత శ్రీకాంత్‌ త్యాగి దాడి చేయ‌డంతో ఇవాళ ఆయ‌న అక్ర‌మ ఇంటిని బుల్డోజ‌ర్ల‌తో కూల్చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు అధికారులు ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. సెక్టార్‌ 93 బీలోని ఓ పార్కులో శ్రీకాంత్‌ త్యాగి మొక్కలు నాటడానికి వెళ్ళ‌గా ఓ మ‌హిళ అభ్యంత‌రాలు తెలిపిన విష‌యం తెలిసిందే. ఆ పార్కును ఆక్రమించి శ్రీ‌కాంత్ త్యాగి మొక్కలు నాటుతున్నార‌ని చెప్పింది.

ఈ నేప‌థ్యంలోనే త్యాగి ఆమెను తిడుతూ నెట్టేసి దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయింది. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త్యాగి తీరును తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఆయ‌న అక్ర‌మంగా నిర్మించిన ఇంటికి ఇవాళ ఉద‌యం వెళ్ళిన అధికారులు, సిబ్బంది దాన్ని బుల్డోజ‌ర్ల‌తో కూల్చేశారు. అయితే, ప్ర‌భుత్వ తీరుపై కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ మండిప‌డ్డారు.

”నోయిడాలోని ఆ బీజేపీ నేత అక్ర‌మంగా ఇళ్ళు క‌ట్టుకున్నార‌న్న విష‌యం ఇన్నేళ్ళుగా బీజేపీకి తెలియ‌దా? అక్ర‌మ నిర్మాణాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నామంటూ బుల్డోజ‌ర్ల‌ను వాడుతున్నామ‌ని అంటున్నారు. అయితే, నా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పండి. ఓ మ‌హిళ‌ను బెదిరించ‌డానికి 10-15 మంది గూండాల‌ను పంపేంత ధైర్యం ఎలా వ‌చ్చింది? మ‌హిళ‌తో అలా అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించేంత ధైర్యం ఎవ‌రు ఇచ్చారు? ఎవ‌రి అండ చూసుకుని అత‌డు రెచ్చిపోతున్నాడు. ఎవ‌రి అండ‌తో అత‌డి అక్ర‌మ వ్యాపారాలు ఇంత‌లా పెరిగిపోయాయి?” అని ప్రియాంకా గాంధీ ప్ర‌శ్నించారు.

Sanjay Raut Judicial Custody: 22 వ‌ర‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి ఎంపీ సంజ‌య్ రౌత్‌