Delhi : వెరైటీ కోసం పాకులాడి గన్తో కేక్ కట్ చేశాడు.. ఆ తరువాత పోలీసులకి చిక్కి…
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేముంది అతగాడి జీవితం జైలుకి చేరింది.
Delhi : ఈ మధ్యకాలంలో పుట్టినరోజుల్ని (Birthday) కూడా చిత్ర విచిత్రంగా సెలబ్రేట్ (celebration) చేసుకుంటున్నారు. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో (social media) పోస్ట్ చేసి వెర్రి ఆనందాన్ని పొందుతున్నారు. ఇలాంటి వీడియోలకి ఆదరణ మాట ఎలా ఉన్నా లేని పోని చిక్కుల్లో పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీకి (delhi) చెందిన ఓ వ్యక్తి తన పుట్టినరోజునాడు కేక్ ని (cake) గన్ తో (gun) కట్ చేసి పోలీసులకు దొరికిపోయాడు.
Viral Video: నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన యువకుడు.. విచిత్రంగా చూసిన ప్రయాణికులు
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బర్త్ డే పార్టీ మొదలైంది. అతని స్నేహితులు అందరూ చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఇక బ్యాగ్రౌండ్ లో పెద్ద ఎత్తున బాణాసంచా (crackers) కూడా పేల్చారు. అంతా బాగానే ఉంది. కేక్త కట్ చేయడం ఒక్కటే ఆలస్యం. చేతిలోకి నైఫ్ ని కాకుండా గన్ తీసుకున్నాడు. క్యాండిల్స్ (candles) ఊది కేక్ ని గన్ తో కట్ చేశాడు. చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. జరిగిన తతంగం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అది అందాల్సిన చోటకే చేరింది. ఇంకేముంది పోలీసులు (police) రంగ ప్రవేశం చేసి అతడి అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.
Amavasya : అమావాస్య రోజున కొంతమంది విచిత్రంగా ప్రవర్తించటానికి కారణం ఏంటంటే?
ఇక అతని వద్ద నుంచి గన్ తో పాటు బుల్లెట్లను (bullets)స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనను ఢిల్లీ పోలీసులు ట్వీట్(tweet) చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. ఈ వీడియో చూసైనా యువతలో మార్పు రావాలని ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని జనం అభిప్రాయపడుతున్నారు.
Taking cognizance of a viral video on social media wherein a young man was cutting cake with a pistol, #DelhiPolice identified the accused and arrested him from Neb Sarai along with .315 bore countrymade pistol & 2 live rounds. Case registered u/s 25 Arms Act. pic.twitter.com/CuBG65nvCP
— Delhi Police (@DelhiPolice) April 1, 2023