rains: అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించండి: భారీ వ‌ర్షాల‌పై సీఎస్ సోమేశ్ సూచ‌న‌లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఆయ‌న మాట్లాడారు.

rains: అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించండి: భారీ వ‌ర్షాల‌పై సీఎస్ సోమేశ్ సూచ‌న‌లు

Somesh Kumar

Updated On : July 10, 2022 / 1:56 PM IST

Heavy rains: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఆయ‌న మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. అన్ని జిల్లాల‌ కలెక్టరేట్ల‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లకు చెప్పారు. ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎస్ తెలిపారు. చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలని సూచించారు. రోడ్లకు నష్టం జరిగితే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.