Karnataka: అవసరమైతే ‘యోగి ఆదిత్యనాథ్ మోడల్’ను కర్ణాటకలో తీసుకువస్తాను: సీఎం బొమ్మై
''ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే సరైన వ్యక్తి. ఆయన మాత్రమే అక్కడి పరిస్థితులను నియంత్రించగలుగుతారు. కర్ణాటకలో మతరప శక్తులను నియంత్రించేందుకు మేము పలు రకాల పద్ధతులను అవలంబిస్తున్నాం. పరిస్థితులు మరింత దిగజారితే, రాష్ట్రంలో మతపర శక్తులకు కళ్ళెం వేసేందుకు అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ మోడల్‌ను తీసుకువస్తాను'' అని బొమ్మై చెప్పారు.

Basavaraj Bommai
Karnataka: కర్ణాటకలో అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ మోడల్ తీసుకువస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కర్ణాటకలో బీజేపీ యువ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రవీణ్ హత్యతో కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై బొమ్మై కూడా జోక్యం చేసుకున్నారు.
దీనిపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ”ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే సరైన వ్యక్తి. ఆయన మాత్రమే అక్కడి పరిస్థితులను నియంత్రించగలుగుతారు. కర్ణాటకలో మతరప శక్తులను నియంత్రించేందుకు మేము పలు రకాల పద్ధతులను అవలంబిస్తున్నాం. పరిస్థితులు మరింత దిగజారితే, రాష్ట్రంలో మతపర శక్తులకు కళ్ళెం వేసేందుకు అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ మోడల్‌ను తీసుకువస్తాను” అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు శాంతి భద్రతలను కాపాడేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. నేరస్థులకు భారీగా జరిమానాలు విధిస్తోంది. అలాగే, బుల్డోజర్లు పంపి వారి అక్రమ ఇళ్ళను కూల్చి వేస్తోంది.
India vs West Indies: 98 పరుగులు చేశాక వర్షం పడడంపై శుభ్‌మన్ గిల్ అసంతృప్తి