wheat export: గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం

గోధుమ ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది.

wheat export: గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం

Wheat Export

Updated On : May 14, 2022 / 9:44 AM IST

wheat export: గోధుమ ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అన్ని రకాల గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే, రెండు అంశాల్లో మాత్రం మినహాయింపునిచ్చింది. విదేశాలతో ఉన్న ఒప్పందం ప్రకారం, ఆయా దేశాలకు సరఫరా చేసే గోధుమలతోపాటు, ఇప్పటికే రవాణాకు సిద్ధం చేసిన గోధుమలను మాత్రం ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చింది. వినియోగ ధరల ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టానికి (7.79 శాతం), రిటైల్ ఫుడ్ ద్రవ్యోల్బణం 8.38 శాతానికి చేరిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

 

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. దీంతో ప్రపంచం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ప్రస్తుతం దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు కూడా గోధుమ పంట ఉత్పత్తిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కేంద్రం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.