Kakinada GGH: బ్లాక్ ఫంగస్ ను జయించిన 18 నెలల బాలుడు!
ఒకవైపు కరోనా మహమ్మారి వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలవరపెడుతుంటే.. ఆ వెనుక ఫంగస్ కూడా తయారై మరింత ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా నుండి కోలుకున్న వారిలో ఎక్కువగా ఈ ఫంగస్ కనిపిస్తుండగా

Kakinada Ggh
Kakinada GGH: ఒకవైపు కరోనా మహమ్మారి వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలవరపెడుతుంటే.. ఆ వెనుక ఫంగస్ కూడా తయారై మరింత ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా నుండి కోలుకున్న వారిలో ఎక్కువగా ఈ ఫంగస్ కనిపిస్తుండగా అందులో కూడా మళ్ళీ బ్లాక్, ఎల్లో, క్రీం, స్కిన్ బ్లాక్ ఫంగస్ అని రకకరాలుగా తయారవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ చిన్నారులలో కూడా అరుదుగా కేసులు నమోదవుతుండగా కాకినాడలో ఓ చిన్నారికి బ్లాక్ ఫంగస్ సోకగా వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా విముక్తి కలిగించారు.
పెనుగొండకు చెందిన 18 నెలల బాలుడికి మే నెల 28న బ్లాక్ ఫంగస్ సోకినట్లుగా నిర్ధారించగా వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ లో చేరారు. ఫంగస్ అప్పటికే ఎడమ పక్క ముక్కు నుండి కన్ను.. ఊపిరితిత్తుల వరకు ఫంగస్ వ్యాప్తించింది. దీంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ధారించుకున్న జీజీహెచ్ వైద్యులు తల్లిదండ్రులకు వివరించారు. వారు కూడా ఒప్పుకోవడంతో మొత్తం పదిమంది పిడియాట్రిక్ వైద్యులు దాదాపు మూడున్నర గంటలపాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించి ఫంగస్ తొలగించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు.