Akhilesh yadav: ప్రతీరాత్రి శ్రీ కృష్ణుడు నా కలలోకి వస్తాడు..రామరాజ్యం నెలకొల్పుతానని చెబుతాడు : అఖిలేశ్ యాదవ్
ప్రతీరాత్రి శ్రీ కృష్ణుడు sl కలలోకి వచ్చి యూపీలో రామరాజ్యం నెలకొల్పుతానని చెబుతున్నాడని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Krishna Tells Me In Dreams I'll Set Up Ram Rajya Said Akhilesh Yadav
Lord Sri Krishna Tells Me In Dreams say Akhilesh Yadav : యూపీలో ఎన్నికల జరుగనున్న క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..‘శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి రాత్రి నాకు కలలోకి వస్తాడని..రామరాజ్యాన్ని నెలకొల్పుతానని చెబుతున్నాడని అన్నారు. ‘త్వరలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని శ్రీకృష్ణుడు తనతో చెబుతున్నాడు‘‘ అని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. బీజేపీకి ఎమ్మెల్యే మాధురి వర్మ అనే ఎమ్మెల్యే ఎస్పీలో చేరుతున్న సందర్భంగా సోమవారం (జనవరి 3,2022) సమాజవాదీ నిర్వహించిన సభలో యాదవ్ మాట్లాడుతు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాధురి వర్మ 2010 నుండి 2012 వరకు UP లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు.
Read more : Akhilesh Yadav : మాపై బురద చల్లడానికే ఐటీ దాడులు-మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్
యూపీలో జరిగే ఎన్నికల్లో సమాజ్ వాద్ పార్టీయే విజయం సాధిస్తుందని..ఎన్నికల తరువాత రాష్ట్రాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని..ఆ విషయాన్ని నాకు శ్రీకృష్ణుడు చెప్పాడని ధీమా వ్యక్తంచేశారు అఖిలేష్ యాదవ్. ‘రామరాజ్యానికి సామ్యవాదమే అంటే సమాజ్‌వాద్ పార్టీయే మార్గం అని.. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజే యూపీలో రామరాజ్యం ఏర్పడుతుంది’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
యూపీలో అధికారంలోకి వచ్చిననాటినుంచి సీఎం యోగి ప్రభుత్వం అన్నింటిలోను విఫలమైందని అఖిలేశ్ విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీలో రౌడీలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలపై అఖిలేష్ స్పందిస్తు..నేరాలు చేసిన క్రిమినల్స్ ను పార్టీలో పదవులు ఇచ్చిన ఘనత బీజేపీదేనని విమర్శించారు. బీజేపీ కోసం ఎంతో కృషిచేసానని చెప్పుకునే యోగీ ఎక్కడినుంచి వచ్చారో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని అఖిలేశ్ సూచించారు. బీజేపీ ప్రభుత్వానికి పేర్లు మార్చటమే పనిగా మారిందని అకిలేశ్ ఎద్దేవా చేశారు. సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తే ఇళ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు అఖిలేష్ యాదవ్.
Read more : BJP Candle Rally : బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ…