ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు, ప్రభుత్వం కీలక నిర్ణయం

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి తిరిగి

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 02:39 AM IST
ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated On : May 22, 2020 / 2:39 AM IST

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి తిరిగి

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్న ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాల్లో కేవలం ట్రాన్స్ జెండర్లను మాత్రమే ఉంచుతారు. వారి భావోద్వేగ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ట్రాన్స్ జెండర్ల కోసం ఇంపాల్ లో రెండు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. అందులో ఒకటి వారి కోసం అంకితమైన కేంద్రం. ట్రాన్స్ జెండర్ల కోసం ఇలా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని మణిపూర్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తమ్ తెలిపారు.

అసౌకర్యం కలగకుండా ప్రత్యేక కేంద్రాలు:
ఇంపాల్ లోని పశ్చిమ జిల్లాలో ప్రభుత్వ అంధుల పాఠశాలలో ఓ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో 24మందికి వసతి కల్పించొచ్చు. గ్రీన్ జోన్ల నుంచి వచ్చే ట్రాన్స్ జెండర్లను ఈ కేంద్రంలో ఉంచుతారు. ఇంపాల్ లోని తూర్పు జిల్లాలో మరియా మాంటిస్సోరి స్కూల్ లో మరో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ల నుంచి వచ్చే వారిని ఇక్కడ ఉంచుతారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ట్రాన్స్ జెండర్ల భావోద్వేగ భద్రత కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది మణిపూర్ ప్రజలు తిరిగి స్వరాష్ట్రానికి వచ్చారు. వారిలో ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. అయితే పురుషులు, మహిళలతో పాటుగా ట్రాన్స్ జెండర్లను కూడా ఒకే క్వారంటైన్ సెంటర్ లో ఉంచడం ద్వారా, ట్రాన్స్ జెండర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. తమకు ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా అందాయి. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

trans

క్వారంటైన్ కేంద్రాల్లో వైఫై సౌకర్యం:
ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల వారి కమ్యూనిటీ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి వారు థ్యాంక్స్ చెప్పారు. ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి అంటున్నారు. శుక్రవారం(మే 22,2020) నుంచి వేర్వేరు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న ట్రాన్స్ జెండర్లను ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రస్తుతానికి ఆ క్వారంటైన్ కేంద్రాల్లో 40మందికి వసతి సౌకర్యం కల్చించొచ్చు. అవసరమైతే ఆ కేంద్రాలను విస్తరిస్తామని అధికారులు చెప్పారు. ఈ కేంద్రాల్లో మెంటల్, హెల్త్ కౌన్సిలింగ్ కేంద్రాలతో పాటు వైఫై సౌకర్యం కూడా ఉంది. 

మానసిక ఆరోగ్యంపై ఫోకస్:
కరోనా మహమ్మారి గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఆహార కొరత, నిరుద్యోగం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ వాటికన్నా ముఖ్యమైంది మానసిక ఆరోగ్యం. దాని గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మానసిక ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సెక్షన్ ఏదైనా ఉందంటే అది ట్రాన్స్ జెండర్లే. అందుకే వారి కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. అందులో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ నిపుణులను నియమించామని అధికారులు తెలిపారు.

Read: క్వారంటైన్ లో మందు కోసం చిందులేసిన బార్ డ్యాన్సర్లు