Chiranjeevi : మెగాస్టార్ మరో రీమేక్..!
చిరు దగ్గరికి డైరెక్టర్స్ అందరూ రీమేక్స్ వెర్షన్స్‌తోనే వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది.. మెగాస్టార్ కూడా మంచి రీమేక్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది..

Chiranjeevi
Chiranjeevi: ‘సాహో’ తర్వాత డైరెక్టర్ టాలీవుడ్‌లో సుజిత్ పేరు పెద్దగా వినిపించలేదు. కానీ ఇప్పుడు పెద్దగా.. అదీ, బిగ్ బాస్ పేరుతో కలిపి హల్ చల్ చేస్తోంది. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించబోయేది ఓ రీమేక్ సినిమా అని కూడా తెలుస్తోంది. నిజంగానే సుజిత్.. చిరుని డైరెక్ట్ చేయనున్నాడా.. మరి ఆల్రెడీ లైనప్‌లో ఉన్న దర్శకుల పరిస్థితి ఏంటి.. అసలు మెగాస్టార్ చిరంజీవికి ఎందుకు అందరూ రీమేక్ స్టోరీలే చెప్తున్నారు..? చిరంజీవి – సుజిత్ కాంబో పట్టాలెక్కనుందా..అంటే అవుననే పాజిటవ్ బజ్ వినిపిస్తోంది. అది కూడా ఓ తమిళ్ రీమేక్‌తో. అదీ ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన సినిమాతో.
తమిళ స్టార్ ‘తల’ అజిత్ హీరోగా నటించిన ‘యెన్నై అరింధాల్’.. తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో రిలీజైంది. ఇప్పుడీ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట చిరంజీవి. ఇదే మూవీ రీమేక్ కోసం ‘సాహో’ సుజిత్ వర్క్ చేయనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం సుజిత్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని.. నచ్చితే సెట్స్ పైకెళ్లేందుకు చిరు ఓకే చెప్తారనే టాక్ ట్రెండ్ అవుతోంది..
నిజానికి మెగాస్టార్ ‘లూసిఫర్’ రీమేక్ ఫస్ట్ ఛాయిస్ సుజిత్. కానీ లాస్ట్ స్టేజ్‌లో మోహన్ రాజా చేతికెళ్లింది. అటు చిరు ‘వేదాళం’ రీమేక్ మెహర్ రమేష్ చేయనున్నాడు. సో, సుజిత్ నెక్ట్స్ ‘యెన్నై అరింధాల్’ తో ముందుకొచ్చాడు. కానీ గౌతమ్ మీనన్ డైరెక్షన్లో అజిత్, అనుష్క, త్రిష లీడ్ రోల్స్ చేసిన ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే మేజర్ ఆడియెన్స్ చూసుంటారు. స్క్రిప్ట్‌లో బలమైన మార్పులు చేస్తే గానీ కొత్త మూవీ చూసిన ఫీల్ రాదు. ఎలాగూ ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్.. ఆ తర్వాత ‘వేదాళం’ రీమేక్.. నెక్ట్స్ బాబీ డైరెక్షన్లో సినిమా.. ఇలా సుజిత్ వంతు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి స్ట్రిప్ట్‌పై ఇంకా వర్క్ చేసేందుకు చాలా సమయమే ఉంది సుజిత్‌కి..
చిరు దగ్గరికి డైరెక్టర్స్ అందరూ రీమేక్స్ వెర్షన్స్‌తోనే వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది.. మెగాస్టార్ కూడా మంచి రీమేక్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.. సూపర్ సీనియర్‌గా మారిన తర్వాత ప్రయోగాలు చేయడం కంటే ఆల్రెడీ హిట్టైన ఫార్ములాను యూజ్ చేయడమే బెటర్ అనేది చిరు ఆలోచన. అందుకే ప్రస్తుతం లైనప్‌లో ఉన్న సినిమాల్లో రీమేక్ సినిమాలే అధికం. మరోవైపు చిరంజీవిని డైరెక్ట్ చేసేందుకు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, ప్రశాంత్ వర్మ వంటివారు కొత్త కథలతో ఎదురుచూస్తున్నారని ఇండస్ట్రీ టాక్..