New Pensions In Telangana: నేటి నుంచి కొత్త పింఛన్లు .. పంపిణీ చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..
6వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వాటిని నేటి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Supportive pensions
New Pensions In Telangana: 76వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 57ఏళ్లు పైబడిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వాటిని నేటి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,46,117 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 35.95లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా, కొత్త వారితో కలిపి ఈ సంఖ్య 45.41లక్షలకు పెరగనుంది.
కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ నేటి నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అయితే ఈ పంపిణీ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆసరా పింఛన్లతో పాటు ఆసరా కార్డులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.