RRR: ఆర్ఆర్ఆర్‌కు కొత్త తలనొప్పి..!

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.....

RRR: ఆర్ఆర్ఆర్‌కు కొత్త తలనొప్పి..!

New Headache For Rrr Movie

Updated On : March 25, 2022 / 9:08 PM IST

RRR: స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి.

RRR: ఇకపై నాన్ RRR.. క్లారిటీ ఇచ్చిన బాహుబలి నిర్మాత!

కాగా ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు పూర్తి సంతోషంతో థియేటర్ల నుండి బయటకు వస్తున్నారు. అయితే తాజాగా అభిమానుల కారణంగా ఆర్ఆర్ఆర్ కు ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారో అందరికీ తెలిసిందే. అయితే వారి అత్యుత్సాహం కారణంగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారట. దీంతో వాటికి భారీ లైకులు, షేర్లు వస్తుండటంతో ఈ సినిమాను సోషల్ మీడియాలోనే ఎక్కువ మంది చూసే ఆస్కారం ఉందని చిత్ర యూనిట్ భయపడుతోంది. అటు ఈ సినిమాను త్వరలో చూడాలనుకునే వారికి కూడా ఈ అత్యుత్సాహం చిరాకు తెప్పిస్తుందట.

Sukumar: రాజమౌళి సార్.. అంటూ RRRపై సుక్కు కామెంట్!

సినిమాను థియేటర్ లో కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే చూడాలా అంటూ వారు మండిపడుతున్నారు. దీంతో అభిమానులు ఎవరూ సెల్ ఫోన్లలో సినిమాను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని చిత్ర యూనిట్ కోరుతోంది. ఇలాంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని థియేటర్ లో చూసే ఎంజాయ్ చేయండి అంటూ చిత్ర యూనిట్ అంటోంది. మరి ఆర్ఆర్ఆర్ యూనిట్ రిక్వెస్ట్ ను అభిమానులు సీరియస్ గా తీసుకుంటారా.. లేక పెడచెవిన పెట్టి ఇలానే సోషల్ మీడియాలో క్లిప్స్ పోస్ట్ చేస్తారా అనేది చూడాలి.