Star Heroes: దసరాకు స్టార్ హీరోల సైలెన్స్.. నిరాశకు లోనైన ఫ్యాన్స్!
టాలీవుడ్‌లో పండగ సీజన్ వచ్చిందంటే, తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు. బాక్సాఫీస్ వద్ద క్లాష్ వచ్చినా, కూడా వసూళ్ల వర్షం కురిపించేందుకు వారు పోటీ పడుతుంటారు. ఇక పండగపూట స్టార్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ను కూడా పెద్ద ఎత్తున అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.

No Star Heores Movie Updates On Dasara
Star Heroes: టాలీవుడ్‌లో పండగ సీజన్ వచ్చిందంటే, తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు. బాక్సాఫీస్ వద్ద క్లాష్ వచ్చినా, కూడా వసూళ్ల వర్షం కురిపించేందుకు వారు పోటీ పడుతుంటారు. అయితే ఈసారి దసరా రోజున కూడా ఇద్దరు స్టార్ హీరోలు, ఓ కొత్త హీరో తమ సినిమాలను బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేశారు. ఇక పండగపూట స్టార్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ను కూడా పెద్ద ఎత్తున అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.
NBK107 Eyes On Dussehra Release: పండగకే దిగుతానంటోన్న బాలయ్య.. ఫ్యాన్స్ కోసమేనట!
అయితే ఈ దసరా పండగ రోజున మాత్రం స్టార్ హీరోలు అందరూ సైలెంట్ అయ్యారు. తమ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్‌ను కూడా వారు అనౌన్స్ చేయలేదు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నలుగురు హీరోల గురించి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రానికి సంబంధించి దసరా రోజున ఏదైనా అప్డేట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక మరో స్టార్ హీరో రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూశారు.
Pushpa2: పుష్పరాజ్ కోసం మరో బాలీవుడ్ హీరో.. ఎవరంటే?
అటు పుష్ప 2 సినిమా నుండి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ చూశారు. తారక్ 30వ చిత్రానికి సంబంధించి కూడా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆసక్తిగా చూశారు. కానీ, దసరా రోజున ఈ నలుగురు హీరోలు కూడా సైలెంట్‌గా ఉండటంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇలా నలుగురు స్టార్ హీరోల సినిమాల గురించి పండగపూట ఎలాంటి అప్డేట్ లేకుండానే ఈ దసరా గడిచిపోవడంతో, అభిమానులు పండగను పూర్తిగా ఎంజాయ్ చేయలేదని సినీ వర్గాలు అంటున్నాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.