కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవటంతో మన బలమేంటో ప్రపంచానికి అర్థమైంది : మోడీ

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవటంతో మన బలమేంటో ప్రపంచానికి అర్థమైంది : మోడీ

Updated On : February 8, 2021 / 12:02 PM IST

PM Modi Speech in Rajya Sabha : పార్లమెంట్  సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో రాజ్యసభలో ప్రధాని మోడీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం ఆ దశాబ్దానికే మార్గదర్శకంగా ఉందని కొనియాడారు. అనంతరం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందని తెలిపారు.

కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవటంతో మన బలమేంటో ప్రపంచానికి అర్థమైందని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా కల్లోలం చేసిందో చూశాం. కానీ భారత్ మాత్రం కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఈ విషయంలో ప్రపంచ దేశాల చూపు భారత్ మీదే ఉన్నాయన్నారు.

కరోనాపై పోరులో భారత్ పలు దేశాలకు అండగా ఉందని మరెన్నో దేశాలకు ఆదర్శవంతంగా నిలిచిందని అన్నారు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ..దేశం అభివృద్దిలో దూసుకుపోతోందని..భాతర్ ప్రపంచ ఫార్మా హడ్ గా మారుతోందని అన్నారు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పటానికి కరోనా సంక్షోభంలో జరిగిన పరిణామాలే నిదర్శనమని అన్నారు.

ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని దీంతో అన్ని రకాల సమస్య పరిష్కారం కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోందని ఇది చాలా గర్వకారణమైన విషయం అని అన్నారు. కొత్త కొత్త అవకాశాలకు భారత్ నిలయంగా మారుతోందని అన్నారు.