Prashanth Varma : క్షమాపణలు కోరిన ప్రశాంత్ వర్మ.. పొగిడేస్తున్న నెటిజన్లు..

టాలీవుడ్ యువ డైరెక్టర్ తన మొదటి సినిమా 'అ' నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ అందర్నీ మెప్పిస్తున్నాడు. 'అ' తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో మెప్పించిన ప్రశాంత్ త్వరలో హనుమాన్ సినిమాతో రాబోతున్నాడు................

Prashanth Varma : క్షమాపణలు కోరిన ప్రశాంత్ వర్మ.. పొగిడేస్తున్న నెటిజన్లు..

Prashanth Varma says sorry to people

Updated On : November 28, 2022 / 7:23 AM IST

Prashanth Varma :  టాలీవుడ్ యువ డైరెక్టర్ తన మొదటి సినిమా ‘అ’ నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ అందర్నీ మెప్పిస్తున్నాడు. ‘అ’ తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో మెప్పించిన ప్రశాంత్ త్వరలో హనుమాన్ సినిమాతో రాబోతున్నాడు. జాంబి రెడ్డి సినిమా తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘హనుమాన్‌’.

హనుమాన్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ టీజర్ బాగుండటంతో సినిమా మరింత రీచ్ అయింది. ఆదిపురుష్ టీజర్ తో దీన్ని పోలుస్తూ నెటిజన్లు ప్రమోట్ చేయడంతో బాగానే ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఇటీవల ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది.

Ali Daughter Marriage : ఘనంగా కమెడియన్ అలీ కూతురి వివాహం.. తరలివచ్చిన టాలీవుడ్..

తాజాగా ఓ విషయంలో ప్రశాంత్‌ వర్మ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ”నా స్పీచ్ లో రామాయణాన్ని పురాణం అన్నందుకు క్షమించండి. అది మన చరిత్ర” అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా చాలా మంది జై శ్రీ రామ్ అంటూ కామెంట్స్ చేస్తూ ప్రశాంత్ వర్మని అభినందిస్తున్నారు. మన రామాయణ, మహాభారతాల గురించి ఇలా మాట్లాడేవారే కరువైపోయారు, మీరు చాలా చక్కగా, ఓపెన్ గా చెప్తున్నారు అంటూ ప్రశాంత్ వర్మని పొగిడేస్తున్నారు.