Ram Charan: కేజీఎఫ్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా.. అంతా తూచ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రీసెంట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా.....

Ram Charan: కేజీఎఫ్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా.. అంతా తూచ్..?

Ram Charan Prashant Neel Movie Only Gossip

Updated On : April 11, 2022 / 4:41 PM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రీసెంట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు చరణ్.

Ram Charan: చరణ్ సరసన తెలుగు బ్యూటీ…?

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నా.. సినీ వర్గాల్లో మాత్రం పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, కేజీఎఫ్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉన్నారు.

Ram Charan: చెర్రీ వేరియేషన్స్.. శంకర్ కోసం నాలుగు గెటప్స్?

అయితే ప్రశాంత్ నీల్ చరణ్‌ను గతంలో కలిసినప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా ఖాయమని.. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కేవలం పుకారుగానే మిగిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్ర ప్రమోషన్స్‌లో యమబిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యలో తన నెక్ట్స్ మూవీల గురించి ప్రస్తావించాడు. కేజీఎఫ్ 2 తరువాత, ప్రభాస్‌తో సలార్ చిత్రం, ఆ తరువాత తారక్‌తో ఓ సినిమా, అటుపై ఉగ్రం హీరోతో మరో సినిమా.. ఇలా వరుసగా సినిమాలున్నాయంటూ చెప్పుకొచ్చాడు.

కానీ ఎక్కడా చరణ్ ఊసే ఎత్తలేదు ఈ కన్నడ డైరెక్టర్. దీంతో చరణ్-ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా మూవీ అనేది కేవలం పుకారే అని ఫిక్స్ అయిపోయారు ఆడియెన్స్. మరి ఈ మాత్రం దానికేనా చరణ్‌తో ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమలో ఆశలు రేపాడు ఈ డైరెక్టర్.. అంటూ ప్రశాంత్ నీల్‌పై మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్.