RRR: కలెక్షన్స్‌పై ఆర్ఆర్ఆర్ టీం ఏమందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను జక్కన్న.....

RRR: కలెక్షన్స్‌పై ఆర్ఆర్ఆర్ టీం ఏమందంటే?

Rrr Team Tweet On Worldwide Collections

Updated On : March 28, 2022 / 8:03 PM IST

RRR: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను జక్కన్న అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు భారీగా క్యూ కట్టారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించడంతో ఈ సినిమాను వారి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు.

RRR Collections : మూడు రోజుల్లో 500 కోట్లు.. అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్

ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి తొలిరోజే అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం తొలి మూడు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతూ యావత్ సినీ ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకుంది. వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గ్రాస్ వసూళ్ల పరంగా గత మూడు రోజుల నుండి టాప్ మూవీగా నిలిచింది. దీంతో ఈ సినిమా పలు హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’కి పైరసి దెబ్బ.. ఆ సైట్‌లో అప్పుడే సినిమా

గత మూడు రోజులుగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ కారణంగానే ఈ సినిమా ఇతర సినిమాలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఎక్కువ గ్రాస్ వసూళ్లు సాధిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా మున్ముందు ఎలాంటి వసూళ్లు రాబడుతుందా.. ఇంకా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అనేది రాబోయే రోజులే చెబుతాయి. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటించారు.