Andhra Pradesh: 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’

 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. వ‌చ్చే నెల‌ 5 నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమ‌వుతాయి.

Andhra Pradesh: 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’

Schools Reopen

Updated On : June 27, 2022 / 7:53 PM IST

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. వ‌చ్చే నెల‌ 5 నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమ‌వుతాయి. ప్రతి ఏడాది జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్‌ 23 వరకు కొనసాగేవన్న విష‌యం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం(2022-23 ) మాత్రం జూలై 5 నుంచి పునఃప్రారంభ‌మై వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగుతాయని ప్ర‌భుత్వం వెల్లడించింది. పాఠశాలలు మొత్తం 220 రోజులు పని చేయనున్నాయి.

Maharashtra: పారిపోయిన వారు గెల‌వ‌రు.. ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌దు: ఆదిత్య ఠాక్రే

ఒకటి నుంచి 9వ తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగుస్తాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) తెలిపింది. ప్రతి తరగతికి వారానికి 48 పీరియడ్లు ఉంటాయి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి 38 నుంచి 39 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. ఒకటి నుంచి 5వ‌ తరగతుల ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంట‌ల‌ వరకు కొనసాగించాలి. అలాగే, సాయంత్రం 3.30 నుంచి 4 వరకు ఆటలు, పునశ్చరణ తరగతులు నిర్వహించాలి. ప్రీ హైస్కూల్‌, హై స్కూల్‌, హై స్కూల్‌ ప్లస్‌ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే, 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆటలు, పునశ్చరణ తరగతులను ఆయా బడులు ఐచ్ఛికంగా నిర్వహించుకోవచ్చని ఎస్‌సీఈఆర్టీ తెలిపింది.

Maharashtra Crisis: మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

మరోవైపు, వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’ ఉంటుంది. జూలై 5 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటికీ… ఉపాధ్యాయులు మాత్రం రేపటి నుంచే పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలోగా తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాలు శుభ్రం చేయించాలి. ఈ నెల‌ 29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమావేశాలు నిర్వహించాలి. జూలై 5న విద్యార్థులకు విద్యా కానుకల కిట్లను పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.