Shruti Haasan: సైజు అడిగిన నెటిజన్.. చురకలంటించిన శృతి!

సెలెబ్రిటీలకు అభిమానులతో పలుమార్లు కొన్ని వింతైన సంఘటనలు ఎదురయితే, మరికొన్ని సార్లు వారికి కోపం తెప్పించే పనులు ఎదురవుతాయి. అయితే సోషల్ మీడియాలో....

Shruti Haasan: సైజు అడిగిన నెటిజన్.. చురకలంటించిన శృతి!

Shruti Haasan Counter Reply To Netizen On Lip Size

Updated On : April 16, 2022 / 7:52 AM IST

Shruti Haasan: సెలెబ్రిటీలకు అభిమానులతో పలుమార్లు కొన్ని వింతైన సంఘటనలు ఎదురయితే, మరికొన్ని సార్లు వారికి కోపం తెప్పించే పనులు ఎదురవుతాయి. అయితే సోషల్ మీడియాలో స్టార్స్‌ను ఫాలో అయ్యే అభిమానులు మాత్రం కొన్నిసార్లు హద్దులు మీరుతుండటంతో, వారికి తగిన బుద్ధి చెప్పేందుకు స్టార్స్ ఘాటైన రిప్లై ఇస్తుంటారు. కానీ స్టార్ హీరోహీరోయిన్లు ఇలా నెటిజన్లకు రిప్లై ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. అయితే తాజాగా అందాల భామ శృతి హాసన్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు ఓ నెటిజన్. దీంతో అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈ బ్యూటీ.

Shruti Haasan: ప్రభాస్ సీక్రెట్స్‌ను బట్టబయలు చేస్తున్న శృతి హాసన్..?

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యే ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న శృతి హాసన్, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెను నెటిజన్లు పలుమార్లు వింతైన ప్రశ్నలు అడుగుతుంటారు. తాజాగా శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ సెషన్ నిర్వహించగా.. ఓ నెటిజన్ శృతి హాసన్‌ను ‘‘నీ లిప్ సైజ్ ఎంత..?’’ అని అడిగాడు. దీంతో శృతి హాసన్ అతడికి సమాధానం ఇస్తూ ‘‘లిప్ సైజు కూడా ఊంటుందా?’’ అని ప్రశ్నించింది.

Shruti Haasan: సీనియర్స్ సూపర్ ఛాయిస్‌గా శృతిహాసన్

దీంతో అవాక్కయిన ఆ వ్యక్తి వెంటనే ఆన్‌లైన్ నుండి వెళ్లిపోయాడు. ఇక ఈ ఎపిక్ రిప్లైతో మరోసారి నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడూ కూల్‌గా ఉండే శృతి హాసన్, తనను ట్రోలింగ్ చేసే వారిని కూడా చాలా లైట్‌గా తీసుకుంటుంది. కానీ ఈసారి సదరు నెటిజన్‌కు శృతి ఇచ్చిన రిప్లై మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏదేమైనా శృతి ‘మించే’ వారికి అప్పుడప్పుడు ఇలాంటి పంచ్‌లు పడితేనే సెట్ అవుతారని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా శృతి హాసన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోండగా, నందమూరి బాలకృష్ణ సరసన గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తోంది.