Shruti Haasan: వారు ఇలా ఉండడమే బెటర్.. కమల్-సారిక విడాకులపై శృతి కామెంట్స్!

సినిమా వాళ్ళ జీవితం దాదాపుగా తెరిచిన పుస్తకమే అనుకోవచ్చు. అందుకే వారి వ్యక్తిగత జీవితాలలో జరిగే చిన్న చిన్న పొరపాట్ల నుండి పెద్ద పెద్ద మలుపుల వరకు అన్నీ ప్రేక్షకులు గుర్తు పెట్టేసుకుంటారు. విలక్షణ నటుడిగా.. నటవిశ్వరూపం చూపించే కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో..

Shruti Haasan: వారు ఇలా ఉండడమే బెటర్.. కమల్-సారిక విడాకులపై శృతి కామెంట్స్!

Shruti Haasan Interesting Comments On Kamal Sarika Divorce

Updated On : May 25, 2021 / 4:22 PM IST

Shruti Haasan: సినిమా వాళ్ళ జీవితం దాదాపుగా తెరిచిన పుస్తకమే అనుకోవచ్చు. అందుకే వారి వ్యక్తిగత జీవితాలలో జరిగే చిన్న చిన్న పొరపాట్ల నుండి పెద్ద పెద్ద మలుపుల వరకు అన్నీ ప్రేక్షకులు గుర్తు పెట్టేసుకుంటారు. విలక్షణ నటుడిగా.. నటవిశ్వరూపం చూపించే కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో ఎన్ని మలుపులు ఉన్న సంగతి తెలిసిందే. కమల్ కు మొదట భరతనాట్య నర్తకి వాణీ గణపతితో వివాహం జరగగా.. పదేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మాజీ నటి సారికను ప్రేమ వివాహం చేసుకోగా ఆ తర్వాత ఆమెతో కూడా విడిపోయారు.

అనంతరం కమల్ మరో మాజీ హీరోయిన్ గౌతమితో కలిసి జీవించడం.. ప్రస్తుతం గౌతమితో కూడా విడిపోయి గడపడం వరకు అందరికీ తెలిసిందే. కాగా.. కమల్, సారికలకు ఇద్దరు కూతుళ్ల్లు కాగా ఆ ఇద్దరే శ్రుతిహాసన్, అక్షర. ప్రస్తుతం ఈ ఇద్దరూ సినిమా రంగంలోకి ప్రవేశించి హీరోయిన్లుగా కొనసాగుతున్న సంగతి కూడా తెలిసిందే. శృతిహాసన్ మన తెలుగు వాళ్లకి బాగా దగ్గరవగా అక్షర మాత్రం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలోనే బిజీగా ఉంది.

అయితే.. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్న కమల్-సారికల జంట అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే అంశంపై ఇప్పటి వరకు చాలా రకాల ప్రచారాలు సాగగా.. కమల్ కూడా ఎప్పుడు దీనిపై స్పష్టంగా చెప్పలేదు. కేవలం అభిప్రాయబేధాలేనని చెప్పేవారు. తాజాగా కమల్-సారికల విడాకులపై పెద్ద కుమార్తె శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి అమ్మ-నాన్న విడిపోవడమే మంచిదని సమాధానం చెప్పింది. అదేమిటి అంటే శృతి గమ్మత్తుగానే సమాధానమిచ్చింది.

వాళ్ళు కలిసున్నప్పటి కంటే విడిపోయిన తర్వాతే సంతోషంగా ఉన్నారని చెప్పిన శృతి.. ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడనివారు బలవంతంగా కలిసి ఉండడం మంచి విషయం కాదని శృతి అభిప్రాయం చెప్పింది. వారు వివాహ బంధం నుంచి విడిపోయినా పిల్లలకు మాత్రం ఎప్పటికీ మంచి పేరెంట్స్ గానే ఉన్నారని చెప్పింది. కలిసి ఉండడం కంటే విడిపోయిన తర్వాత అమ్మా.. నాన్నా ఇద్దరూ ఆనందంగానే ఉన్నారని.. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పింది.