NSA Ajit Doval: దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తుల యత్నం: అజిత్ డోభాల్
దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. దేశంలో మతం, భావజాలాల పేరిట కొందరు ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. సామరస్యాన్ని చెడగొట్టి, అశాంతిని సృష్టించే శక్తుల పట్ల దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు.

Ajit Doval
NSA Ajit Doval: దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. దేశంలో మతం, భావజాలాల పేరిట కొందరు ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. సామరస్యాన్ని చెడగొట్టి, అశాంతిని సృష్టించే శక్తుల పట్ల దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. ఆలిండియా సూఫీ సజ్జాదానశీన్ కౌన్సిల్ ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఇందులో మత పెద్దలు పాల్గొని శాంతి, ఐక్యత కోసం తీర్మానం చేసే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అజిత్ డోభాల్ మాట్లాడుతూ… దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు దేశంలోని సామరస్య వాతావరణాన్ని పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
భారత్ మొత్తం ఒకే తాటిపై నడుస్తుందనే సందేశాన్ని దేశంలోని అన్ని వర్గాల వారు తెలుసుకునేలా చేయాలని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మతానికి పూర్తి స్వేచ్ఛ ఉందని, దీని పట్ల మనం గర్వించాలని ఆయన చెప్పారు. మతపర శత్రుత్వానికి చెక్ పెట్టేందుకు భారతీయులు అందరూ కలిసి పనిచేయాల్సి ఉందని అన్నారు. మతం పేరిట శత్రుత్వాన్ని పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిపై మనం మౌనంగా చూస్తూ ఉండొద్దని అన్నారు. అశాంతిని సృష్టించే శక్తులకు వ్యతిరేకంగా గళం విప్పాలని చెప్పారు.
Kerala: యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసిన బాలుడు.. తాగి ఆసుపత్రిలో చేరిన అతడి స్నేహితుడు