ఈసారి బోనాల వేడుకలు రద్దు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా నేపథ్యంలో బోనాల వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బోనాల వేడుకలు రద్దు చేసింది. కరోనా

  • Published By: naveen ,Published On : June 10, 2020 / 10:05 AM IST
ఈసారి బోనాల వేడుకలు రద్దు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated On : June 10, 2020 / 10:05 AM IST

కరోనా నేపథ్యంలో బోనాల వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బోనాల వేడుకలు రద్దు చేసింది. కరోనా

కరోనా నేపథ్యంలో బోనాల వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బోనాల వేడుకలు రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఆలయాల్లో బోనాలను పూజారులే సమర్పిస్తారని చెప్పింది. ఎవరి ఇంట్లో వాళ్లు బోనాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బోనంతో ఆలయాలకు రావొద్దని ప్రభుత్వం కోరింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, అధికారులు బోనాల వేడుకల నిర్వహణ అంశంపై బుధవారం(జూన్ 10,2020) సమీక్ష నిర్వహించారు. బోనాల వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయించారు. ఆలయాల్లో బోనాలు సమర్పించడానికి ఎవరినీ అనుమతించకూడదని డెసిషన్ తీసుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రజలు సహకరించాలని ప్రభుత్వం కోరింది.

దీంతో జంట నగరాల్లో ఏటా ఆషాఢ మాసంలో కనిపించే బోనాల వేడుకల సందడి ఈసారి లేనట్లే. ఎవరి ఇంట్లో వారు బోనం సమర్పించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆలయాల్లో అమ్మవార్లకు పూజారులు మాత్రమే బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ప్రజలు ఎవరి ఇంట్లో వారే దేవతలకు బోనాలు సమర్పించుకోవాలని సూచించారు.

* ఈ ఏడాది బోనాల వేడుకలు రద్దు
* ఈ ఏడాది ఆలయాల్లో పూజారులే బోనం సమర్పిస్తారు
* ఆలయ పరిసరాల్లో పూజారులే ఘటాలను ఊరేగిస్తారు
* అమ్మవార్లకు పట్టువస్త్రాలను కూడా పూజారులే సమర్పిస్తారు
* ఎవరి ఇంట్లో వారు బోనం సమర్పించుకోవాలి
* బోనంతో దేవాలయాలకు ఎవరూ రావొద్దు
* మంత్రుల సమావేశంలో నిర్ణయాలు
* ప్రజలకు పెద్ద సెంటిమెంట్ బోనాలు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పూజారులు మాత్రమే బోనం సమర్పిస్తారు
* ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పాటించాలని పిలుపు

Read: రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు