PM Modi In Telangana : నేను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే అలిసిపోను : ప్రధాని మోడీ

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పభుత్వంపై ఆసక్తికర విమర్శలు చేశారు. నేను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే నిర్విరామంగా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా అలిసిపోను అంటూ ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బేగంపేట మీటింగ్ లో . టీఆర్ఎస్ నేతలు తనపై చేసే విమర్శలపై మోడీ ఇలా తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

PM Modi In Telangana : నేను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే అలిసిపోను : ప్రధాని మోడీ

PM Modi interesting comments in Begumpet meeting on TRS government

Updated On : November 12, 2022 / 2:46 PM IST

PM Modi In Telangana : ఏపీ పర్యటన ముగించుకుని తెలంగాణకు వచ్చారు ప్రధాని మోడీ ఈ సందర్బంగా బేగంపేటలో బీజేపీ ఏర్పాటుచేసిన సభలో టీఆర్ఎస్ పభుత్వంపై తనదైనశైలిలో శాంతంగా..వాడిగా వేడిగా విమర్శలు సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను..బీజేపీని తిట్టటమే పనిగా పెట్టుకుందని..నన్ను,బీజేపీని తిట్టటం వల్ల తెలంగాణకు ప్రయోజనం కలుగుతుంది అనికుంటే ఎన్నైనా తిట్టుకోండి కానీ తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించను..బదులు చెప్పి తీరుతాను అన్నారు మోడీ.

తాను కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాలు తిరుగుతుంటాను..మీరు ఇలా విశ్రాంతి లేకుండా తిరుగుతాను కదా అలసిపోరా అని కొంతమంది తనను అడుగుతుంటారని కానీ నేను అలసి పోను..ఎందుకంటే తనను చాలామంది తిట్టుకుంటుంటారని అలా నేను రోజుక రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే అలసిపోను అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు వేశారు ప్రధాని మోడీ. 22 ఏళ్లుగా నన్ను చాలామంది తిడుతునే ఉన్నారు..నన్ను తిట్టేవారిని పట్టించుకోకండీ..సాయంత్రం చాయ్ తాగుతు ఆ తిట్లను ఎంజాయ్ చేయండీ అంటూ కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్ధేశం చేశారు.

PM Modi In Telangana : తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా.. అవినీతి చేసేవారిని వదిలి పెట్టను : ప్రధాని మోడీ

ప్రజలకు సేవ చేయడానికి ఉన్న మార్గం రాజకీయం అని అటువంటి రాజకీయాల్లోకి నేను ప్రజలకు సేవల చేయటానికే వచ్చానన్నారు. రాజకీయాలు సేవాభావంతో ఉండాలి..కానీ తెలగాణలో మాత్రం అధికారంలో ఉన్నవారు మోడీని తిట్టటమే రాజకీయం అనుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు ఎన్నివిధాలుగా బీజేపీని తిట్టినా మేం మాత్రం పాజిటివ్ దృక్పథంతోనే ఉంటామని మా కార్యకర్తలు అంకితభావంతోనే పనిచేస్తారని అన్నారు ప్రధాని మోడి. నేను తెలంగాణను..హైదరాబాద్ ను ఎప్పటికీ మర్చిపోలేను..2013లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద తెలంగాణ ప్రజలు చూపించిన ప్రేమను ఎన్నిటి మర్చిపోలేనన్నారు.

కాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.9,500 కోట్లతో పలు అభివృద్ధి, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.6,300 కోట్లతో పునరుద్ధరించిన ఆర్ఎఫ్ సీఎల్ పరిశ్రమను జాతికి అంకితం చేయనున్నారు.దాదాపు రూ.1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వే లైన్‌ను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. దాదాపు రూ.9,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఎన్‌హెచ్‌ 765 జీ చెందిన మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్, ఎన్‌హెచ్ 161 బీబీకి చెందిన బోధన్-బాసర-భైంసా సెక్షన్, ఎన్‌హెచ్ 353 సీకి చెందిన సిరోంచా- మహాదేవపూర్ సెక్షన్లున్నాయి.

PM Modi In Visakha : ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ప్రస్తావన లేదు .. స్టీల్ ప్లాంట్ ఊసే లేదు..