Tensions In Belagavi : కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం..బెలగావిలో టెన్షన్..12 వాహనాలు ధ్వంసం
బెంగళూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి కొంతమంది దుండగులు సిరా పూసారు.దీంతో కర్నాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు ప్రాంతమైన బెలగావిలో టెన్షన్ మొదలైంది.దీంతో బెలగావిలో ఉద్రిక్తత.

Tensions In Karnataka Belagavi
Tensions In Karnataka Belagavi : బెంగళూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి కొంతమంది దుండగులు సిరా పూసారు.దీంతో కర్నాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు ప్రాంతమైన బెలగావిలో టెన్షన్ మొదలైంది. బుధవారం (డిసెంబర్ 15,2021) రాత్రి బెంగళూరులోని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి కొంతమంది సిరా పూసారు.దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా సరిహద్దు వివాధం మరోసారి ప్రారంభమైంది. మహారాష్ట్రీయులు బెలగావి శివాజీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేశారు. దోషులను గుర్తించి, వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో నిరసన అదుపు తప్పింది.
అలాగే శుక్రవారం రాత్రి స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలీ రాయన్న విగ్రహం కూడా ధ్వంసమైంది. దీంతో బెలగావీలో టెన్షన్ నెలకొంది. దీంతో బెళగావిలో పరిస్థితి ఉద్రికత్తగా మారింది. ఈ గొడవలో ప్రభుత్వానికి సంబంధించిన 12 వాహనాలు ధ్వంసమయ్యాయి. అధికారులు జనాలు బెల్గావీలో దాదాపు 144 సెక్షన్ విధించినట్లుగా మారింది. జనాలు గుంపులుగా తిరగొద్దని హెచ్చరించారు.
విగ్రహాల వివాదంపై కర్నాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పందిస్తు..శివాజీ విగ్రహానికి ఇంక్ పూసినవారిని వెంటనే గుర్తించి..శిక్షిస్తామని..అలాగే సంగోలీ రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కూడా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల కోసం మహా వ్యక్తులను కించపరచడం ఏమాత్రం భావ్యం కాదని ఈ సందర్భంగా హోంమంత్రి సూచించారు.కాగా..కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా బెళగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్ మరోసారి వినిపిస్తోంది. మహారాష్ట్ర ఏకికరణ్ సమితి డిసెంబర్ 13న అసెంబ్లీ వెలుపల ఇదే విషయంపై నిరసన చేస్తున్నారు.
కన్నడ అనుకూల సంఘాల సభ్యులు మహారాష్ట్ర ఏకీకరణ సమితి దీపక్ దాల్వీ ముఖంపై సిరా పూశారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేయటం జరిగింది. దీనికి ప్రతీకారంగా మంగళవారం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సమితి మద్దతుదారులు కన్నడ జెండాను దహనం చేసినట్లు సమాచారం. మరుసటి రోజు రాత్రి బెంగళూరులోని శివాజీ విగ్రహానికి సిరా పూశారు. విగ్రహంపై ఓ వ్యక్తి ఇంకు పోస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.