కరోనా నుంచి కోలుకున్న MLC..అంతలోనే మళ్లీ ఆసుపత్రికి..ఏం జరిగింది

  • Published By: madhu ,Published On : May 17, 2020 / 12:13 PM IST
కరోనా నుంచి కోలుకున్న MLC..అంతలోనే మళ్లీ ఆసుపత్రికి..ఏం జరిగింది

Updated On : May 17, 2020 / 12:13 PM IST

కరోనా నుంచి కోలుకున్నాడు ఆ ఎమ్మెల్సీ..కానీ..మళ్లీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన శివసేన MLCకి పాము కాటు వేయడంతో తిరిగి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 
థానేకి చెందిన శివసేన MLCకి కరోనా వైరస్ సోకింది.

దీంతో వైద్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ములుంద్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఈయన…2020, మే 15వ తేదీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కానీ కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్ లోనే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన ఎవరినీ కలవవద్దని నిర్ణయించుకుని…సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న బంగ్లాలో ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే..2020, మే 16వ తేదీ శనివారం బయట కూర్చొని ఉండగా..విషపూరిత పాము కట్టింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి..చికిత్స అందించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.