street children : వీధి బాలల కోసం ఓ టీవీ షోరూం వాళ్లు చేసిన మంచి పని తెలిస్తే అభినందిస్తారు

వీధి బాలల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. కనీస అవసరాలు కూడా నోచుకోలేని జీవితాలు.. కళ్ల నిండా ఎన్నో కలలు.. వారిని దరి చేరనిచ్చేవారే ఉండరు. అలాంటి వారిని సంతోష పరిచేందుకు ఓ టీవీ షోరూం చేస్తున్న మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు.

street children : వీధి బాలల కోసం ఓ టీవీ షోరూం వాళ్లు చేసిన మంచి పని తెలిస్తే అభినందిస్తారు

street children

Updated On : April 23, 2023 / 12:57 PM IST

street children :  వీధి బాలలకు రోజంతా రోడ్డుమీదే జీవనం. హోటల్, షాప్ ఎక్కడికి వెళ్లాలన్నా లోనికి రానివ్వరు. ఏదైనా వారికి అందని ద్రాక్షే. అలాంటి వారి కోసం చెన్నైలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్ చేస్తున్న పనికి అభినందనలు చెప్పాలి.

software engineer letter : “జీవితంలో ఒంటరితనం అనుభవిస్తున్నాను.. సంతోషంగా ఉండేందుకు సలహా ఇవ్వండి” .. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాసిన లేఖ వైరల్

పేరుకి మహా నగరాలు.. నిరుపేదల పరిస్థితిలో ఏ మార్పు రావట్లేదు. ఇప్పటికీ ఎంతోమంది చిన్నారులు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. ఫుట్ పాత్ ల దగ్గర దయనీయమైన పరిస్థితుల్లో కనిపిస్తుంటారు. పాలకులు, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకుంటున్నామని చెబుతున్నా కొందరి బాలల పరిస్థితి అధ్వాన్నంగానే ఉంటోంది. స్కూల్‌కి వెళ్లి పాఠాలు నేర్చుకునే వయసులో భిక్షాటన చేస్తూ.. బరువులు మోస్తూ బాల్యాన్ని నరకప్రాయంగా గడుపుతున్నారు. వారికి చిన్న చిన్న ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ వారికి పట్టించుకునేవారెవరు? చెన్నైలోని ఓ టీవీ షోరూం టీవీ చూడటానికి ఆశపడే చిన్నారుల కోసం ఓ మంచి పని చేస్తోంది. ప్రతి సాయంత్రం వీధి బాలలు వారికి నచ్చిన సినిమాలు, కార్టూన్ షోలు చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకోసం కొంత ప్లేస్ ని, టీవీలను కేటాయించింది. ఆ సమయంలో వీధి బాలలంతా అక్కడ చేరి తమకు నచ్చిన టీవీ షోలను చూసి సంబరపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్‌.. ఫోటో వైరల్!

వీధి బాలల కోసం టీవీ షోరూం నిర్వాహకులు చేపట్టిన మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు. దేశం ముందుకు వెళ్తుంటే ఇంకా వీరి పరిస్థితిలో మార్పు రాకపోవడం విచారకరమని.. ఇలాంటి వీడియోలు చూడటం ద్వారా అయినా ప్రపంచంలో మార్పు రావాలని కోరుతున్నారు. ఈ వీడియో మాత్రం @cctvidiots అనే యూజర్ ద్వారా ట్విట్టర్‌లో షేరై ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.