Veera Simha Reddy: ఇండియా-బంగ్లా మ్యాచ్‌లో వీరసింహారెడ్డి హవా.. బాలయ్యా మజాకా!
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలవడంతో, సెమీ ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నట్లు అయ్యింది. ఈ మ్యాచ్‌ను వీక్షించినవారికి ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ హవా కనిపిస్తుంది.

Veera Simha Reddy Mania In India Vs Bangladesh Match
Veera Simha Reddy: ఇండియన్స్‌కు రెండు విషయాలు అంటే మహా ఇష్టం.. ఒకటి క్రికెట్, రెండోది సినిమా. ఈ రెండింటితోనూ మనం ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉంటాం. ఇక ఈ రెండింటిలో ఏది వస్తున్నా దాన్ని వీక్షించేందుకు కోట్లాది మంది ప్రేక్షకులు సిద్ధమవుతారు. అటు పలువురు క్రికెటర్లు కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది.
Veera Simha Reddy: బాలయ్య సినిమాలో ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదట.. ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ..?
ఈ మ్యాచ్‌లో ఇండియా గెలవడంతో, సెమీ ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నట్లు అయ్యింది. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు. కాగా, ఈ మ్యాచ్‌ను వీక్షించినవారికి ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ హవా కనిపిస్తుంది. ఇండియా క్రికెట్ మ్యాచ్‌లో బాలయ్య హవా ఏమిటని అనుకుంటున్నారా.. నిన్న జరిగిన ఈ మ్యాచ్ స్టేడియంలో బాలయ్య అభిమానులు కూడా సందడి చేస్తూ కనిపించారు. వారు బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి పోస్టర్‌ను పట్టుకుని కనిపించారు.
Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య వీర బాదుడు మామూలుగా ఉండదట!
అయితే ఈ పోస్టర్‌లో ఓవైపు బాలయ్య కనిపిస్తుండగా, మరో వైపు విరాట్ కోహ్లిని ఎడిట్ చేసి పెట్టారు. ఈ ఫోటోను విరాట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటోను చూసిన వీరసింహా రెడ్డి చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా దీన్ని పోస్ట్ చేయడంతో, బాలయ్యా మజాకా అంటూ నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.
#VeerasimhaReddy At #IndvsBan match today?? pic.twitter.com/415U5q0dr3
— Gopichandh Malineni (@megopichand) November 2, 2022