Woman Dancing : రైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యంగా యువతి డ్యాన్స్.. ప్రమాదకరం అని మండిపడుతున్న జనం

రైల్వే స్టేషన్లు, మెట్రోలు దాటి.. ఇప్పుడు డ్యాన్సులు రైల్వే ట్రాక్ ఎక్కాయి. రీసెంట్‌‌గా రైలు పట్టాలపై ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. యువతి డ్యాన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

Woman Dancing : రైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యంగా యువతి డ్యాన్స్.. ప్రమాదకరం అని మండిపడుతున్న జనం

Woman dancing Viral

Updated On : May 31, 2023 / 3:56 PM IST

Woman Dancing Viral : మెట్రో రైళ్లు.. ప్లాట్ ఫామ్ లు అయిపోయాయి.. ఇక డ్యాన్సులు, వీడియోలు రైల్వే ట్రాక్ ఎక్కాయి. ఓ యువతి రైల్వే ట్రాక్ పై చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది.

Woman Dance : ఇమ్రాన్ హష్మీ ,సన్నీ లియోన్‌ల ‘పియా మోర్’ పాటకు ఓ యువతి చేసిన మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్

రైలు పట్టాలపై ఓ యువతి చేసిన డ్యాన్స్ చూసి జనాలు షాకయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ avnikarish షేర్ చేసిన వీడియోలో నీలంరంగు చీర ధరించి రైల్వే ట్రాక్ మధ్యలో నిలబడి హర్యాన్వీ పాటకు యువతి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా మండిపడ్డారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వీడియోను ముంబయి పోలీసులకు ట్యాగ్ చేసిన ఓ వ్యక్తి ‘@ముంబయి పోలీస్.. ఈ ప్రమాదకరమైన చర్యపై ఎఫ్ఐఆర్’ నమోదు చేయాలని కోరాడు. ‘రైల్వే ట్రాక్ ల వద్ద అనేక ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వింటున్నాం. ఇక కొందరు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇది నేరం.. ‘ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Anand Mahindra : కొత్త కారు కొన్న ఆనందంలో డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ఇప్పటికే మెట్రో రైళ్లలో డ్యాన్సులు, వీడియోలు, ముద్దులు పెట్టుకోవడం వంటి అభ్యంతరకరమైన వీడియోలతో కొంతమంది తోటి ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. దీనితో అలెర్ట్ అయిన అధికారులు మెట్రోల్లో పోలీసింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో యువత రైలు పట్టాలను కూడా వదలట్లేదు. ఇలాంటి ఫీట్లు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Avnikarish Avnikarish (@avnikarish)