Stomach Cancer : పొట్టలో తరచూ ఇబ్బందికలుగుతుందా ? అయితే జాగ్రత్త పడాల్సిందే..

కడుపు క్యాన్సర్ ప్రధానంగా 50 ఏళ్ల పైబడిన వ్యక్తులను వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులలో కొంచెం ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ధూమపానం , ధూమపానం వంటి జీవనశైలి కారకాల కారణంగా పురుషులు ఎక్కువగా దీని భారిన పడుతున్నారు.

Stomach Cancer : పొట్టలో తరచూ ఇబ్బందికలుగుతుందా ? అయితే జాగ్రత్త పడాల్సిందే..

Stomach Cancer

Stomach Cancer : భారతదేశంలో క్యాన్సర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. కడుపు క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కడుపులో ఉండే కణాలలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది దీర్ఘకాలంలో కడుపులో అభివృద్ధి చెందుతుంది. ప్రారంభంలో లక్షణాలు స్పష్టంగా ఉండకపోవటంతో దీనిని గుర్తించటం కష్టంగా ఉంటుంది.

READ ALSO : Breast Cancer : యువతులలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ? నిర్ధారణ, చికిత్స

క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు కడుపులోని ఇతర భాగాలకు, సమీపంలోని అవయవాలకు వ్యాపిస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తుంది. భారతదేశంలో కడుపు క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కడుపు క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

అనారోగ్యకరమైన జీవనశైలి , పెరిగిన ఒత్తిడి స్థాయిలు, జన్యు పరమైన కారణాలు, జంక్ ఫుడ్ తినటం వంటి కారణాల వల్ల భారతదేశంలో కడుపు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రత్యేకమైన ఆహార పద్ధతులు, ముఖ్యంగా మసాలా ఆహారాలు, ఆల్కహాల్ తీసుకోవడం వంటి కారణాల వల్ల పొట్ట క్యాన్సర్ రోగులు పెరుగుతున్నట్లు నిపుణులు అంటున్నారు.

READ ALSO : sweet potatoes health benefits : వీటిని తింటే క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధులనుండి రక్షణ పొందొచ్చు తెలుసా !

కడుపు క్యాన్సర్ ప్రధానంగా 50 ఏళ్ల పైబడిన వ్యక్తులను వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులలో కొంచెం ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ధూమపానం , ధూమపానం వంటి జీవనశైలి కారకాల కారణంగా పురుషులు ఎక్కువగా దీని భారిన పడుతున్నారు.

ఆహార విధానాలు ఎక్కువ కారంగా, ఉప్పగా ఉన్న ఆహారాలను తీసుకునే వారిలో కడుపు క్యాన్సర్ గు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. హార్మోన్ల వ్యత్యాసాలు , జన్యుపరమైన కారకాలు కీలక పాత్రను పోషిస్తాయి. అయితే దీనిపై పూర్తి స్ధాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది.

కడుపు క్యాన్సర్ యొక్క లక్షణాలు ;

నిరంతర కడుపు నొప్పి లేదా అసౌకర్యం
బరువు తగ్గడం
ఆకలి లేకపోవడం
మింగడం కష్టంగా మారటం
వికారం
వాంతులు
మలంలో రక్తం

వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రారంభ-దశ కడుపు క్యాన్సర్ లో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏమాత్రం అనుమానం వచ్చినా ముందస్తుగా వైద్యుల వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవటం మంచిది.

READ ALSO : Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే !

కడుపు క్యాన్సర్ రకాలు ;

రోగనిర్ధారణ దశను బట్టి కడుపు క్యాన్సర్ ను రకాలుగా వర్గీకరించారు.

అడెనోకార్సినోమా
లింఫోమా
గ్యాస్ట్రోఇంటెస్టినల్ స్ట్రోమల్ ట్యూమర్స్ (GISTs)

వాస్తవానికి చాలా మందిలో పొట్టక్యాన్సర్ చివరి దశలో నిర్ధారించటంతో అది అధిక మరణాల రేటుకు కారణమవుతుంది. ధూమపానం, ఆల్కహాల్, నైట్రేట్‌లు మరియు హెలికోబాక్టర్ పైలోరీ ఇన్‌ఫెక్షన్ వంటి వివిధ ఎటియోలాజికల్ కారకాలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా క్యాన్సర్ చికిత్స కోసం శస్త్రచికిత్స, రేడియోథెరపీ మరియు కీమోథెరపీతో సహా మల్టీమోడాలిటీ చికిత్స అవసరాన్ని బట్టి వైద్యులు అందిస్తారు.

READ ALSO : Oral Cancer : స్మార్ట్ ఫోన్ తో నోటి క్యాన్సర్ గుర్తించవచ్చు.. ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

కడుపు క్యాన్సర్ నివారణ ;

కడుపు క్యాన్సర్‌ను అరికట్టడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో పాటు ఆహారపు అలవాట్లను మెరుగుపరచాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్లు మరియు కూరగాయలతో సమృద్ధిగా సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తగ్గించడం, ధూమపానం మానేయడం, ఆల్కహాల్ తీసుకోవడం నియంత్రించడం తరుచుగా వైద్య పరీక్షలు చేయించుకోవటం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.