Sunscreen Lotions : చర్మ ఆరోగ్యానికి సన్ స్క్రీన్ లోషన్స్ అవసరమా?
అందువల్ల సూర్యకాంతిలో ఉన్నా లేకపోయినా సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం ముఖ్యం. సూర్యరశ్మి, నీలి కాంతికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మానికి ఫ్రీ రాడికల్ నష్టం వాటిల్లుతుంది.

Sunscreen Lotions
Sunscreen Lotions : చర్మ ఆరోగ్యం కోసం చాలా మంది సన్ స్క్రీన్ లోషన్స్ ను ఉపయోగించటం మనం నిత్యం చూసే ఉంటాం. అయితే దీనికి కారణం ఉంది. సూర్యరశ్మి కఠినమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడే సన్‌స్క్రీన్ లోషన్లు, క్రీములు గురించి అనేక అపోహలు ఉన్నాయి. నిపుణులు చాలా కాలంగా సన్‌స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించడం ప్రాముఖ్యతను వివరిస్తూ వస్తున్నారు. ఇది రక్షణ కవచం మాత్రమే కాకుండా చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. చర్మానికి ఎలాంటి హాని జరగకుండా పువ్వులా వికసించాలంటే హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. మన చర్మం ఎప్పుడూ కూడా పొడిబారి పోకుండా ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుపుదనంగా ఉంటుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ ని రెగ్యులర్ గా వాడటం వల్ల స్కిన్ కి నేచురల్ గ్లో అనేది చాలా ఈజీగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
వేసవిలో మాత్రమే కాకుండా శీతాకాలంలో కూడా సన్‌స్క్రీన్‌ను ఉపయోగించటం వల్ల చర్మానికి మేలు కలుగుతుంది. శీతాకాలంలో ఓజోన్ పొర చాలా పలుచగా ఉంటుంది. అందువల్ల ఓజోన్ పొర తక్కువ యు.వి కిరణాలను గ్రహిస్తుంది. ఆ విధంగా మన చర్మాన్ని తాకిన యు.వి రేడియేషన్ సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్లు చర్మానికి హాని కలిగిస్తాయి. ఇవి అకాల వృద్ధాప్యం, చర్మంపై పిగ్మెంటేషన్ వంటి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తాయి, వీటిని స్కిన్ పిగ్మెంటేషన్ డిజార్డర్స్ అని కూడా పిలుస్తారు. చలికాలంలో అతినీలలోహిత కిరణాలకు గురికావడం వల్ల చర్మ కణాలలోని డిఎన్ ఎ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
శీతాకాలంలో తేమ తక్కువగా ఉండటం, విపరీతమైన చల్లని గాలుల కారణంగా, మన చర్మం పొడిగా పగుళ్లు, ముడతలు. ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. కాబట్టి చలికాలంలో సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల చర్మం తేమను కాపాడుతుంది. చలికాలంలో వచ్చే మరో సమస్య చర్మం నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఒక్కోసారి చర్మం తేమను కోల్పోయి ఆ తర్వాత పొడిబారుతుంది. ఫలితంగా చర్మం తేమ లేకుండా చికాకు, ఎరుపు రంగులోకి మారటం వంటి చోటు చేసుకుంటాయి.
అందువల్ల సూర్యకాంతిలో ఉన్నా లేకపోయినా సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం ముఖ్యం. సూర్యరశ్మి, నీలి కాంతికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మానికి ఫ్రీ రాడికల్ నష్టం వాటిల్లుతుంది. అలాగే వృద్ధాప్య ప్రారంభ సంకేతాలు వంటి సమస్యలను తగ్గించడంలో సన్‌స్క్రీన్ సహాయపడుతుంది. చర్మంపై ముడతలు, గీతలపై ప్రభావవంతంగా ఉంటుంది.అధిక మెలనిన్ ఉత్పత్తి కారణంగా చర్మంపై డార్క్ ప్యాచ్‌లను పిగ్మెంటేషన్ అంటారు. సూర్యరశ్మి, దుమ్ము, కాలుష్యానికి నిరంతరం బహిర్గతం కావడం వల్ల ఈ నష్టం జరుగుతుంది.
అదే క్రమంలో అతిగా సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం చర్మానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉపయోగించే కొన్ని రసాయనాల కారణంగా చర్మం సౌందర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మం ఎరుపుగా మారటం, వాపు, మండటం, దురద వంటి వాటికి దారితీసే అవకాశం ఉంటుంది.