Lemon And Fenugreek Water : ఉదయం నిద్రలేవగానే మెంతులు, నిమ్మకాయ నీరు త్రాగటం వల్ల బరువు తగ్గుతారా ? దీన్ని ఎలా సిద్ధం చేయాలంటే ?

ఈ పానీయంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. శరీరం ఆహారం నుండి ఎక్కువ విటమిన్లు, ఖనిజాలను గ్రహించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

Lemon And Fenugreek Water : ఉదయం నిద్రలేవగానే మెంతులు, నిమ్మకాయ నీరు త్రాగటం వల్ల బరువు తగ్గుతారా ? దీన్ని ఎలా సిద్ధం చేయాలంటే ?

Lemon And Fenugreek Water

Updated On : May 25, 2023 / 6:15 AM IST

Lemon And Fenugreek Water : ప్రతిరోజూ ఉదయాన్నే మెంతల నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పురాతన కాలం నుండి ఈ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, ఆధునిక ఆరోగ్యం, ఫిట్‌నెస్ కార్యకలాపాల్లో ప్రస్తుతం ఈ విధానానికి మరింత ప్రజాదరణ లభిస్తోంది. మెంతి నీరు తాగడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి, బరువు తగ్గడం , జీర్ణక్రియ మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి, మెంతుల నుండి గరిష్ట ప్రయోజనాలను ఎలా పొందాలంటే దానికి నిమ్మకాయ నీరు జోడిస్తే సరిపోతుంది.

READ ALSO : గర్భిణులు మెంతులు తినకూడదా?

ప్రతిరోజూ ఉదయాన్నే మెంతి, నిమ్మరసం తాగడం వల్ల ప్రయోజనాలు ;

ప్రతిరోజూ ఉదయాన్నే మెంతి నీరు త్రాగడం వల్ల బరువు తగ్గే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. మెంతిలో సహజమైన ఔషదగుణాలు ఉన్నాయి. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఆరోగ్యంగా, మరింత శక్తిని పొందడంలో మీకు సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే మెంతి , నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. మెంతిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండా ఉంచి, అల్పాహారం మరియు అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది

నిమ్మరసం నీరు, క్రమం తప్పకుండా తీసుకుంటే, టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది, ఇది కొవ్వును కరిగించటానికి తోడ్పడుతుంది. మెంతి, నిమ్మరసం ఈ రెండింటినీ కలపడం వల్ల బరువు తగ్గించే ప్రక్రియను మరింత వేగవంతం అవుతుంది.

READ ALSO : Fenugreek : జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

ఈ పానీయంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. శరీరం ఆహారం నుండి ఎక్కువ విటమిన్లు, ఖనిజాలను గ్రహించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. బరువును సులభంగా తగ్గేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి మేతి మరియు నిమ్మకాయ నీరు తయారీ ఎలా ?

వాస్తవానికి దీనిని తయారు చేయటం సులభం. ఇందుకోసం ముందుగా 1 టీస్పూన్ మెంతి గింజలు, సగం నిమ్మకాయ , 1 కప్పు నీరు, తీసుకోవాలి. ముందుగా ముందురోజు రాత్రి బెంతులను ఒక కప్పు నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు మిశ్రమాన్ని వడకట్టి విత్తనాలను పక్కన పెట్టుకోవాలి. దాని కొంచెం నిమ్మకాయ నీరు కలుపుకుని కావాలనుకుంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనీటిని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

READ ALSO : Fenugreek Seeds : పొట్ట తగ్గించి, మధుమేహాన్ని అదుపులో ఉంచే మెంతులు

ప్రతిరోజూ ఉదయం మెంతి, నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కడుపులో మంటను తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి , రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.