Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్య.. పాటించాల్సిన జాగ్రత్తలు.

కొందరిలో వంశపాంపర్య కారణాల వల్ల నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. లివర్ ఫ్యాటీగా మారిన సందర్భంలో శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి.

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్య.. పాటించాల్సిన జాగ్రత్తలు.

Liver

Updated On : August 16, 2021 / 3:59 PM IST

Fatty Liver : కాలేయమనేది మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవం. అనేక సార్లు కాలేయం ప్రమాదకరమైన సమస్యలకు లోనవుతుంది. ఆల్కాహాల్ సేవించే వారిలో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కవగా వస్తుంది. కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. అదిక బరువు, కొలెస్ట్రాల్ స్ధాయిలు అధికంగా ఉండటం, పొగతాగటం, మద్యం సేవిచటం, హైబీపి, డయాబెటిస్ వంటి వాటివల్ల ఎక్కవ మంది ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడుతున్నారు.

లివర్ ఫ్యాటీగా మారిన సందర్భంలో శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి లేకపోవటం..బరువు తగ్గిపోవటం, నీరసం అలసట, చర్మంపై దురదలు, చర్మం, కళ్ళు పసుపు రంగు వర్ణంలోకి మారుతుండటం, కడుపునొప్పి, పాదాల వాపులు, ఆందోళన, ఛాతి పెరగటం వంటి లక్షణాలు ఫ్యాటీ లివర్ వచ్చిన వారిలో గమనించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుని వారు సూచించిన విధంగా మందులు వాడుకుంటూ జాగ్రత్తలు పాటించాలి.

ప్రతిరోజు వ్యాయామాన్ని దైనందిన జీవితంలో బాగం చేసుకోవాలి. బోజనం చేసిన తరువాత కనీసం 15 నిమిషాలపాటు వాకింగ్ చేయటం మంచింది. నూనె పదార్ధాలు, జంక్ ఫుడ్స్, మాంసాహారం అధికంగా తినటాన్ని ఆపేయాలి. నిర్ణీత సమయంలో భోజనం చేయాలి. పలుచని మజ్జిగ, కొబ్బరినీరు త్రాగటం మంచిది. రోజు 2టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటే లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది.

లావుగా ఉన్నవారిలోనే ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయని, సన్నగా ఉండే వారిలో ఈ సమస్యలు రావని చాలా మంది బావిస్తుంటారు. అయితే అది అపోహమాత్రమే సన్నగా ఉన్నవారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్యలు ఉత్పన్నమౌతాయి. మద్యం సేవించేవారు దానిని మితంగా తీసుకోవటం ఉత్తమం. దూమపానం చేసేవారు మానేయటమే మంచిది. అధిక బరువును అదుపులో ఉంచుకుంటూ షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.