Lung Health : ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దోహదపడే ఆహారాలు !

యాపిల్స్ సహజ యాంటిహిస్టామైన్ క్వెర్సెటిన్ కు మూలం. ఒక అధ్యయనంలో క్వెర్సెటిన్ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడైంది. రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్‌లను అల్పాహారం తీసుకోవడం వల్ల ఆస్తమాని తగ్గుంచుకోవటానికి ఆరోగ్యకరమైన మార్గంగా చెప్పవచ్చు.

Lung Health : ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దోహదపడే ఆహారాలు !

lung health

Updated On : October 24, 2023 / 12:34 PM IST

Lung Health : ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి అవసరం ఉంది. వీటి సామర్థ్యం అనేది శరీరానికి అవసరమైన శక్తిని పొందడానికి సహాయపడుతుంది. శరీరానికి ఆక్సిజన్‌ను వేగంగా రవాణా చేయడానికి ఊపిరితిత్తులు సహాయపడతాయి. శ్వాసకోశ వ్యవస్థ శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ఉచ్ఛ్వాస ప్రక్రియలో శరీరంలోని కార్బన్ డయాక్సైడ్‌ను తొలగిస్తుంది. వయసు పెరిగే కొద్దీ మన ఊపిరితిత్తుల సామర్థ్యం ,పనితీరు క్షీణిస్తుంది. కాలుష్యం, ధూమపానం , ఆస్తమా వంటి పల్మనరీ వ్యాధులు ఇబ్బందికరంగా మారతాయి. కొన్ని ఊపిరితిత్తుల వ్యాయామాలు, జీవనశైలి మార్పులతో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

READ ALSO : Pink Bollworms : పత్తిలో గులాబి పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఊపిరిత్తుల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్ ;

1. బచ్చలికూర

ఇండియన్ జర్నల్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా మరియు ఇమ్యునాలజీలో ప్రచురించబడిన అధ్యయనంలో బచ్చలికూరలో మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. బచ్చలికూరలో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తోడ్పడే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని సలాడ్‌లోకి స్మూతీలో, పాస్తాలో చేర్చుకుని తీసుకోవచ్చు.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

2. పసుపు

పసుపులో కర్కుమిన్ అనే కీలకమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆస్తమా రోగులకు బాగా ఉపకరిస్తాయి. రోజువారీ ఆహారంలో చిటికెడు పసుపును తీసుకోవటం వల్ల మంచి ఫలితారు పొందవచ్చు. కర్కుమిన్ వాపుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగటం ద్వారా ఊపిరితిత్తులు పనితీరు మెరుగురుచుకోవచ్చు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

3. యాపిల్స్

యాపిల్స్ సహజ యాంటిహిస్టామైన్ క్వెర్సెటిన్ కు మూలం. ఒక అధ్యయనంలో క్వెర్సెటిన్ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడైంది. రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్‌లను అల్పాహారం తీసుకోవడం వల్ల ఆస్తమాని తగ్గుంచుకోవటానికి ఆరోగ్యకరమైన మార్గంగా చెప్పవచ్చు. రోజుకు ఒక యాపిల్ ఆస్తమా లక్షణాలను దూరంగా ఉంచుతుంది. యాపిల్స్‌లో ఉండే క్వెర్సెటిన్, సహజమైన యాంటిహిస్టామైన్‌గా పనిచేస్తుంది. శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది.

READ ALSO : Microbial Insecticides : రైతు స్థాయిలో సూక్ష్మ జీవన క్రిమి సంహారాల తయారీ

4. చేపలు

సాల్మన్ , వంజరం వంటి చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వాయుమార్గంలో తలెత్తే వాపును తగ్గిస్తాయి. ఒక అధ్యయనం ఆహారంలో ఒమేగా 3 కొవ్వులు కలిగిన చేపలను తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. వారానికి రెండు సార్లు వీటిని తీసుకోవచ్చు. ఈ చేపలు మెదడుకు మాత్రమే కాకుండా ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి.

READ ALSO : Onion Cultivation : ఉల్లిసాగులో రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

5. అల్లం

ఔషధ గుణాలు కలిగిన అల్లాన్ని ఎన్నో సంవత్సరాలుగా వంటకాల్లో నిత్యం ఉపయోగిస్తున్నారు. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ , బ్రోంకోడైలేటర్ ప్రభావాలను కలిగి ఉందని పరిశోధనలో తేలింది. వేడి అల్లం టీ ఆస్తమా నుండి ఉపశమనం కలిగించటానికి దోహదపడుతుంది. ఆస్తమా వ్యతిరేక పోరాటంలో ఈ ఆహారాలు ఊపిరితిత్తులకు మేలు కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.