Goji Berries : గోజీ బెర్రీలు…ఆరోగ్యానికి బెస్ట్

క్యాన్సర్ రాకుండా కాపాడటంలో సహాయకారిగా గోజీ బెర్రీలను చెప్పవచ్చు. విటమిన్ సి, జియాక్సంతిన్, కెరోటినాయిడ్స్‌తో సహా అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడటానికి కారణమౌతాయి.

Goji Berries : గోజీ బెర్రీలు…ఆరోగ్యానికి బెస్ట్

Dried Goji Berries

Updated On : March 8, 2022 / 11:57 AM IST

Goji Berries : గోజీ బెర్రీలను లైసియం బార్బరమ్ అని కూడా పిలుస్తారు. గోజీ బెర్రీ ఆసియాకు చెందిన పండు. ఆసియాలోని ప్రజలు 2,000 సంవత్సరాలకు పైగా ఈ పండును ఔషధ మూలికగా, ఆహార పదార్ధంగా ఉపయోగిస్తున్నారు. గోజీ బెర్రీలు ప్రస్తుతం మార్కెట్ తోపాటు, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. గోజీ బెర్రీలు ఆహారంగా తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని అనేక పరిశోధనల్లో నిర్ధారించారు. ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గోజీ బెర్రీలు వయస్సుసంబంధిత కంటి వ్యాధుల నుండి కాపాడతాయని నమ్ముతారు. గోజీ బెర్రీలు దృష్టి లోపాన్ని నివారించటంలో సహాయపడతాయి… ఎందుకంటే వాటిలో అధిక స్థాయిలో ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ముఖ్యంగా జియాక్సంతిన్..అదే యాంటీఆక్సిడెంట్లు కంటికి జరిగే నష్టాలైన UV కాంతి, ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి వంటి వాటిని నివారించటంలో దోహదపడతాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్టోమెట్రీ యొక్క జర్నల్ ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్స్‌లో నివేదించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 90 రోజుల పాటు గోజీ బెర్రీ జ్యూస్ తాగిన పెద్దలలో జియాక్సంతిన్, ఇతర యాంటీఆక్సిడెంట్ స్థాయిలను గణనీయంగా పెరిగినట్లు గుర్తించగలిగారు.

రోగనిరోధక వ్యవస్థ పెంపొందించటంలోను గోజీ బెర్రీలు ఎంతో ఉపయోగకరంగా చెప్పవచ్చు. గోజీ బెర్రీస్ ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు వాటి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ,ఇన్ఫ్లమేషన్‌తో పోరాడే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. గోజీ బెర్రీలు బ్లూబెర్రీస్ మరియు రాస్ప్బెర్రీస్తో సహా ఇతర బెర్రీల మాదిరిగానే విటమిన్ ఎ మరియు సిలను పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. జలుబు నుండి క్యాన్సర్ వరకు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, అనారోగ్యాలను నివారించడానికి విటమిన్లు A మరియు C చాలా ముఖ్యమైనవి.

క్యాన్సర్ రాకుండా కాపాడటంలో సహాయకారిగా గోజీ బెర్రీలను చెప్పవచ్చు. విటమిన్ సి, జియాక్సంతిన్, కెరోటినాయిడ్స్‌తో సహా అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడటానికి కారణమౌతాయి. యాంటీఆక్సిడెంట్లు కణితి పెరుగుదలను నెమ్మదిస్తాయి, వాపును తగ్గిస్తాయి. అంతేకాకుండా శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. డ్రగ్ డిజైన్, డెవలప్‌మెంట్ అండ్ థెరపీ జర్నల్‌లో నివేదించబడిన ఎలుకల ట్రస్టెడ్ సోర్స్‌పై పరిశోధన ప్రకారం గోజీ బెర్రీలతో కణితి పెరుగుదలను నిరోధించవచ్చని, క్యాన్సర్ చికిత్సల ప్రభావాన్ని పెంచుతాయని కనుగొన్నారు.

ఆరోగ్యకరమైన చర్మాన్ని గోజీ బెర్రీల్లోని బీటా కెరోటిన్‌లు దోహదం చేస్తాయి. బీటా కెరోటిన్ ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బీటా కెరోటిన్ అనేదాన్ని చర్మసంబంధిత క్రీమ్‌ల తయారీలో వినియోగిస్తారు. గోజీ బెర్రీలు తీసుకోవటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. చర్మం చికాకును తగ్గిస్తుంది. సూర్యుని ప్రభావాల కారణంగా చర్మానికి జరిగే నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధాప్యఛాయలను తగ్గిస్తుంది. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో 5 శాతం గోజీ రసం వాటికి అందించినప్పుడు UV లైట్ డ్యామేజ్ ,చర్మ రుగ్మతల నుండి రక్షించడానికి తగినంత యాంటీఆక్సిడెంట్లను అందించినట్లు ఒక అధ్యయనం ద్వారా గుర్తించారు.

రక్తంలో చక్కెరను స్థిరీకరించటంలో గోజీ బెర్రీలు తోడ్పడతాయి. రక్తంలోకి చక్కెర విడుదలను నియంత్రించడంలో గోజీ బెర్రీలు సహాయపడతాయి. గోజీ బెర్రీలు రక్తంలో ఇన్సులిన్ , గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయని 2015లో జరిపిన పరిశోధనల్లో స్పష్టమైంది. అదే అధ్యయనం ద్వారా టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో గోజీ బెర్రీల తీసుకోవటం ద్వారా మంచి కొవ్వులైన HDL స్థాయిల పెరుగుదలను గుర్తించారు. చైనీయులు అయితే వీటిని చిరుతిండిగా ఉపయోగిస్తారు. సూప్‌లో వేసుకుని తింటారు. వీటిని ఎండబెట్టి డబ్బాల్లో నిల్వచేస్తారు.