Back Pain : గర్భదారణ సమయంలో వెన్నునొప్పి బాధిస్తుంటే!

నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు వేడినీటిలో క్లాత్ ను ముంచి కాపడం పెట్టుకోవటం వల్ల కొంత మేర నొప్పులు తగ్గుతాయి. శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి తేలిక పాటి వ్యాయామాలను ఎంచుకోవాలి.

Back Pain : గర్భదారణ సమయంలో వెన్నునొప్పి బాధిస్తుంటే!

Back Pain During Pregnancy

Updated On : April 6, 2022 / 10:26 AM IST

Back Pain : గర్భధారణ సమయంలో వెన్నునొప్పి అనేది సాధారణమైన సమస్యలలో ఒకటి, దిగువ వీపుపై ప్రారంభమయ్యే నొప్పి నెమ్మదిగా తొడలు, కాళ్ళు , పిరుదులకు వ్యాపిస్తుంది. ఈ నొప్పులు కారణంగా రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో ఎక్కవ శాతం మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. వెన్నునొప్పి కి గురుత్వాకర్షణ కేంద్రం మారడం, బరువు పెరగడం, అభివృద్ధి చెందుతున్న పిండం బరువు,పెల్విక్ కండరాలపై ఒత్తిడి కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి సందర్భంలో నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని రకాల మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిటారుగా కూర్చోవడం, వెనుక లేదా నడుము వెనుక దిండు సహాయంతో కర్చోవటం చేయాలి. సరైన భంగిమలో కూర్చోవటం వల్ల వెన్ను, నడుము నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. ప్రసూతి బెల్ట్‌లను ఉపయోగిస్తే కొంత మేర ఫలితం ఉంటుంది. బరువైన వస్తువులను ఎత్తడం , తరలించడం వంటివి వెన్నుపై వత్తిడి పెంచుతాయి. అలాంటి పనులు ఏమాత్రం చేయకూడదు.

నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు వేడినీటిలో క్లాత్ ను ముంచి కాపడం పెట్టుకోవటం వల్ల కొంత మేర నొప్పులు తగ్గుతాయి. శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి తేలిక పాటి వ్యాయామాలను ఎంచుకోవాలి. వాకింగ్, మెడిటేషన్, యోగా ,వంటివి అనుసరించటం మంచిది. ఇవి వెన్నెముకపై ఒత్తిని తగ్గించేందుకు ఉపకరిస్తాయి. వీటిని సాధ్యమైనంత వరకు వైద్యుల సూచనలు, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయటం మంచిది. నొప్పి అధికంగా ఉన్న సమయంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స , సలహా తీసుకోవటం ఉత్తమం