Ginger Milk : ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా చేయటంతోపాటు, జీర్ణ శక్తిని పెంపొందించే అల్లంపాలు!
జీర్ణశక్తి లేని వారు లేదా ఆ శక్తి బాగా తగ్గిన వారు నిత్యం అల్లం పాలు తాగితే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఎలాంటి ఆహారాన్నయినా సరే అవలీలగా జీర్ణం చేసుకోగలుగుతారు. అలాగే మలబద్దకం, కడుపు నొప్పి, అసిడిటీ తగ్గుతాయి.

In addition to preventing infections, ginger milk improves digestion!
Ginger Milk : అల్లంలో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. పురాతన కాలం నుంచి వాడుతున్న వంట ఇంటి పదార్థాల్లో అల్లం ఒకటి. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. మనకు వచ్చే స్వల్ప అనారోగ్య సమస్యలైన దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం తదితర సమస్యల నుంచి అల్లం మనల్ని బయట పడేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములను చంపేస్తాయి. అలం రసాన్ని రోజు ఉదయం పాలల్లో కలుపుకుని అల్పాహారం తీసుకున్న తరువాత తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
పాలల్లో అల్లం రసం కలుపుకుని తాగటం వల్ల ప్రయోజనాలు ;
1. క్యాన్సర్ కణాలు పెరగకుండా ; అల్లం రసం కలిపిన పాలు తాగడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. వర్షాకాలంలో మనకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జింజర్ మిల్క్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నశింపజేస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. సూక్ష్మ క్రిములు శరీరంలోకి చేరగానే నశిస్తాయి.
2. జీర్ణశక్తి పెరుగుతుంది ; జీర్ణశక్తి లేని వారు లేదా ఆ శక్తి బాగా తగ్గిన వారు నిత్యం అల్లం పాలు తాగితే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఎలాంటి ఆహారాన్నయినా సరే అవలీలగా జీర్ణం చేసుకోగలుగుతారు. అలాగే మలబద్దకం, కడుపు నొప్పి, అసిడిటీ తగ్గుతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఈ సీజన్‌లో మనకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
3. దంతాలు, ఎముకలు ధృఢంగా ; జింజర్ మిల్క్‌లో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి. ఆస్టియో పోరోసిస్ సమస్య ఉన్నవారు ఈ మిల్క్‌ను తాగితే మంచిది. దీంతో ఎముకల వద్ద శరీర భాగం వాపులకు గురి కాకుండా ఉంటుంది. నొప్పులు తగ్గుతాయి.
4. చక్కెర స్ధాయిల నియంత్రణ ; టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు జింజర్ మిల్క్ తాగితే వారి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
అల్లం పాలను తయారు చేసే విధానం:
ఒక పాత్రలో పాలను తీసుకుని అందులో తురిమిన అల్లం వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు పొయ్యిపైన పెట్టి బాగా మరిగించాలి. అనంతరం దానిలో నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేయాలి. తరువాత స్టవ్ పై నుండి పాత్రను దించుకోవాలి. అనంతరం అందులో బెల్లం పొడి వేసి బాగా కలుపుకుకోవాలి. అవసరం అనుకుంటే రుచికోసం అందులో డ్రై ఫ్రూట్స్ లేదా కుంకుమ పువ్వును కలుపుకోవచ్చు. అలా తయారైన అల్లం పాలను గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి.