Tamarind : చింతపండు ఆరోగ్యానికి ప్రయోజనకరమా?
చింతపండు తో తయారైన పదార్థాలు జ్వరము గొంతు నొప్పి రుమాటిజం వంటి రుగ్మతలను పోగొడుతుంది. రక్తపోటును తగ్గించటంతోపాటు, అల్సర్ల నివారణకు సహాయపడుతుంది.

Tamarindo
Tamarind : చింతపండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి మనం చింతపండుని విరివిగా వాడుతున్నాము. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్ గడ్, కర్ణాటక రాష్ట్రాల్లో చింతపండును సాగు చేస్తున్నారు. దక్షిణ భారత వంటకాల్లో చింతపడును విరివిగా వినియోగిస్తారు. చింతపండు వల్ల జీర్ణ సమస్యలు అలానే ప్రేగుల్లో ఆహారము కదలిక సాఫీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీనిలోని పీచు సహజ విరేచనకారిగా పని చేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది.
చింతపండులో పాలీశాఖరైట్స్ కి బెయిల్ ఆక్టివిటీ పెంచే గుణం ఉంది కాబట్టి జఠర రసాలను బాగా స్రవింపజేసి జీర్ణ క్రియ త్వరగా జరిగేటట్టు సహకరిస్తుంది. అలాగే రక్తం లో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం చింతపండు లో ఉంది. శరీరానికి అవసరమైన ఐరన్ లో సుమారు 10% చింతపండు ద్వారా లభిస్తుంది. కాబట్టి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సక్రమంగా ఆక్సిజనేషన్ జరుగుతుంది. శరీరము బరువు తగ్గడానికి అవసరమైన హైడ్రోక్సీసిట్రిక్ ఆమ్లంలో చింతపండు రసం గ్రహిస్తాయి.
చింతపండు తో తయారైన పదార్థాలు జ్వరము గొంతు నొప్పి రుమాటిజం వంటి రుగ్మతలను పోగొడుతుంది. రక్తపోటును తగ్గించటంతోపాటు, అల్సర్ల నివారణకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను సమసతుల్యం చేయటంలో దోహదం చేస్తుంది. ఉడకబెట్టిన చింత పువ్వులు, ఆకులను బెణుకులు,బొబ్బలు, కీళ్ళవాపులకు మంచి ఔషదంగా పనిచేస్తాయి.
చింతకాయలను చూస్తేనే కొందరికి నోట్లో నీళ్లూరతాయి. చింతకాయలు పచ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూరలు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. పచ్చి చింతకాయల పచ్చడి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. చింతపండులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు నిల్వ కాకుండా చూస్తుంది. అందువల్ల అధిక బరువు తగ్గుతారు. యాంటీఆక్సిడెంట్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది.
అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు రోజువారిగా చింతపండు వాడకపోవటమం మంచిది. ఇలా వాడకం వల్ల రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. బిపితో బాధపడుతూ మందులు వాడుతున్న వారు సైతం చింతపండును వాడకపోవటమే ఉత్తమం.