Protein : ప్రొటీన్ లోపించిందా?…ఆరోగ్య సమస్యలు తప్పవు!…
చర్మం, జుట్టు మరియు గోర్లు ప్రధానంగా ప్రోటీన్‌తో నిర్మాణమౌతాయి. ప్రోటీన్ లోపిస్తే చర్మం క్షీణతకు గురవుతుంది. జట్టు ఒత్తును కోల్పోవటం, రాలటం, గోర్లు విరిగిపోవటం వంటివి చోటు చేసుకుంటాయి.

Protein
Protein : మన శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే అవసరమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. జీవక్రియ మొదలు కండరాల సంశ్లేషణ వరకు ప్రోటీన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రోటీన్ యొక్క పాత్ర సాధారణంగా కండరాల పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటుంది. జీవనశైలి, ఆరోగ్య కారకాల ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కోవిధమైన ప్రోటీన్ అవసరాలు ఉన్నాయి. మన మానసిక స్థితికి కారణమైన వివిధ రకాల హార్మోన్లు,న్యూరోట్రాన్స్మిటర్లను సంశ్లేషణ చేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది.
ప్రోటీన్ లోపం వల్ల జీవక్రియ నెమ్మదించడం, రోగనిరోధకత తగ్గడం, కీళ్ళ, కండరాల నొప్పులు, జుట్టు రాలటం, గోళ్ళ పెళుసుదనం వంటివి వస్తాయి. మానసిక కల్లోలం , శక్తి తగ్గడం , అలసట, పిల్లల్లో కుంటుపడిన ఎదుగుదల , మూత్రపిండాలు సరిగా పని చేయకపోవుట, రక్తహీనత వంటివి కూడా ప్రోటీన్ లోపం వల్ల వచ్చే మరికొన్ని లక్షణాలు. శరీరంలో ప్రోటీన్‌ను కోల్పోవడం వల్ల మానసిక స్థితిలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. తగినంత ప్రోటీన్ తీసుకోకుంటే శరీరంలో కండరాల వ్యవస్ధ సరిగా ఉండదు. ప్రొటీన్ లోపిస్తే కండరాలను కోల్పోవాల్సి వస్తుంది. తక్కువ ప్రోటీన్ తీసుకోవడం మీ శక్తి స్థాయిలను స్వల్పంగా ముంచుతుంది. శరీరానికి తగినంత ప్రొటీన్ అందకుంటే రక్తంలో చక్కెర స్ధాయిలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
చర్మం, జుట్టు మరియు గోర్లు ప్రధానంగా ప్రోటీన్‌తో నిర్మాణమౌతాయి. ప్రోటీన్ లోపిస్తే చర్మం క్షీణతకు గురవుతుంది. జట్టు ఒత్తును కోల్పోవటం, రాలటం, గోర్లు విరిగిపోవటం వంటివి చోటు చేసుకుంటాయి. అంతే కాకుండా వృద్ధాప్యంలో ఎముక సాంద్రతను కాపాడడంలో ప్రోటీన్ అవసరత ఎంతో ఉంటుంది. ప్రొటీన్లు తక్కువగా ఉన్నవారిలో ఆపరేషన్ల సమయంలో కోతలు మానిపోయేందుకు ఎక్కవ సమయం పడుతుంది. రక్తం గడ్డకట్టటానికి సైతం ప్రొటీన్ అవసర ఉంటుంది. శరీర బరువును బట్టీ రోజుకు కిలో బరువుకు ఒక గ్రాము ప్రొటీన్ చొప్పున ఎన్నికిలోల బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. పాలు, పెరుగు, పన్నీర్ , చిరుధాన్యాలు, సోయా, పచ్చిబఠానీ, పప్పులు వంటి వాటిల్లో అధిక ప్రొటీన్ లభిస్తుంది. వాటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది.