Lime Juice : గ్లాసు బత్తాయి జ్యూస్ తో బోలెడు ప్రయోజనాలు

బత్తాయిలో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగతుంది. తద్వారా వ్యాధులు, ఇన్ ఫెక్షన్ల వంటి వాటికి గురవ్వకుండా ఉండొచ్చు. శరీరాని

Lime Juice : గ్లాసు బత్తాయి జ్యూస్ తో బోలెడు ప్రయోజనాలు

Lime

Updated On : August 23, 2021 / 4:36 PM IST

Lime Juice : అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే పండ్లలో బత్తాయి కూడా ఒకటి. వేసవి సీజన్ లో బత్తాయిలకు మంచి డిమాండ్ ఉంటుంది. నిమ్మపండుకంటే పెద్ద సైజులో ఉండే బత్తాయిలను జ్యూస్ తీసుకుని తాగుతారు. రుచిలో కొద్దిగా పులుపుతో కూడిన తీపితనంతో బత్తాయి ఉంటుంది. కొంత మంది బత్తాయి కాయలను ఒలుచుకుని తింటే , మరికొందరు దానిని జ్యూస్ గా పిండుకుని తాగుతారు.

బత్తాయి రసంలో సి విటమిన్, పోటాషియం పుష్కలంగా లభిస్తాయి. బత్తాయి జ్యూస్ ను రోజుకు ఒక గ్లాసు చొప్పున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండులో ఫ్లెవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రం చేయటంతోపాటు, జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ తో బాధపడేవారికి బత్తాయి రసం ఎంతో మేలు కలిగిస్తుంది. బత్తాయి జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం , తేనె కలుపుకుని ఉదయం సమయంలో తాగితే షుగర్ లెవల్స్ క్రమేపి తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

బత్తాయిలో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగతుంది. తద్వారా వ్యాధులు, ఇన్ ఫెక్షన్ల వంటి వాటికి గురవ్వకుండా ఉండొచ్చు. శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గర్భిణీలు బత్తాయి రసాన్ని తీసుకోమని వైద్యులు సలహాఇస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఇందులో ఉండే కాల్షియం కడుపులో బిడ్డతోపాటు, తల్లికి మేలు కలిగిస్తుంది.

ఒంట్లో వేడిని తగ్గించటానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. బత్తాయి రసంలో కాస్తంత గ్లూకోజ్ కలుపుకుని తీసుకుంటే మూత్రనాళంలో సమస్యలతోపాటు, మంట తగ్గుతుంది. గుండె ఆరోగ్యంతోపాటు, రక్త ప్రసరణ మెరుగవుతుంది. బత్తాయిలో పెగుల్లో పూతల వల్ల ఏర్పడే అల్సర్లు, గ్యాస్ సమస్యను తగ్గించే గుణం ఉంది. బరువు తగ్గటంతోపాటు, కంటి ఆరోగ్యానికి బత్తాయి జ్యూస్ శ్రేయస్కరం.