Meditation Lead Psychosis : ధ్యానంతో మనశ్శాంతి వస్తుంది.. కొంతమందిలో మానసిక సమస్యలు.. ఎందుకిలా?

సాధారణంగా.. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధాన్యం చేస్తుంటారు.. ఒత్తిడిని ఎదుర్కొనేవారిలో ధ్యానంతో మనస్సును శాంతపరుచుకోవచ్చు అంటారు. నిజానికి ఇది సరైనదే.. కానీ, అన్నివేళలా ధాన్యం కూడా మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు..

Meditation Lead Psychosis : ధ్యానంతో మనశ్శాంతి వస్తుంది.. కొంతమందిలో మానసిక సమస్యలు.. ఎందుకిలా?

Meditation Lead Psychosis

Updated On : June 23, 2021 / 7:18 PM IST

Meditation Lead Psychosis : సాధారణంగా.. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధాన్యం చేస్తుంటారు.. ఒత్తిడిని ఎదుర్కొనేవారిలో ధ్యానంతో మనస్సును శాంతపరుచుకోవచ్చు అంటారు. నిజానికి ఇది సరైనదే.. కానీ, అన్నివేళలా ధాన్యం కూడా మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు.. ఏదైనా అతిచేస్తే.. ఎలాగైతే సమస్యగా మారుతోందో అలాగే.. ధాన్యంతో కూడా మానసిక సమస్యలకు దారితీస్తుందని ఓ కొత్త అధ్యయంలో తేలింది. ఇండియానా యూనివర్శిటీ బ్లూమింగ్టన్ లోని జూనియర్ స్టూడెంట్ కూడా తన 20 యేటా ఇలాంటి సమస్యనే ఎదుర్కొందట.. తనకు ఎంతో ఇష్టమైన వయోలెన్ విద్యను కూడా సరిగా అభ్యసించలేకపోయింది. ప్రతిసారి తాను ప్లే చేసేందుకు ప్రయత్నించిన సమయంలో అధిక ఒత్తిడి ఎదురయ్యేదట.. దాంతో తన చదువును కూడా కొనసాగించలేని పరిస్థితి ఎదురైంది.

దాంతో ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు మెడిటేషన్ (ధ్యానం) వైపు మళ్లింది. ఉదయం సమయంలో 30 నిమిషాల పాటు మెడిటేషన్ చేసింది. ఏడాది తర్వాత ఆమెలో ఒత్తిడి క్రమంగా తగ్గినట్టు తెలిపింది. ఆ తర్వాత మెడిటేషన్ ఆపేయడంతో మళ్లీ ఆమెలో చీకటి రోజులు ఆరంభమయ్యాయి. వయోలిస్టు మాదిరిగానే మిలియన్ల మంది తమ మానసికంగా, భౌతికంగా ఒత్తిడిని అధిగమించేందుకు మెడిటేషన్ వైపు మళ్లుతున్నారు.

2012 నుంచి 2017 మధ్యకాలంలో అమెరికాలో ధ్యానం వైపు మళ్లే వారి సంఖ్య ఏడాదిలో మూడింతలు అయింది. 4.1 శాతం నుంచి 14.2 శాతానికి పెరిగినట్టు నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏదిఏమైనా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం ద్వారా బ్లడ్ ప్లజర్ తగ్గడంతో పాటు జీర్ణశయ సంబంధిత సమస్యలు, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు అధికమయ్యాయని రీసెర్చర్లు చెబుతున్నారు. కానీ, మెడిటేషన్ కూడా ఎప్పుడూ ప్రయోజనకారంగా ఉండదని కూడా హెచ్చరిస్తున్నారు.

మొదట్లో ధ్యానంలో మనస్సు మీద ఏకాగ్రత కుదిరినంతంగా ఉండటం లేదట.. మెడిటేషన్ చేసిన ప్రతిసారి తమ ఏకాగ్రతను కోల్పోతున్నారట.. దీని తీవ్రత కూడా చాలామందిలో ఎక్కువగా కనిపించినట్టు చెబుతున్నారు. ధాన్యం తర్వాత ఒక మానసిక వ్యాధికి గురికావడం ఈ ఒక వయోలిస్ట్ మాత్రమే కాదు.. డజన్ల మంది ధ్యానం తర్వాత ఇలాంటి మానసిక సమస్యలే ఎదుర్కొన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. మెడిటేషన్ ప్రాక్టీసు చేసిన చాలామందిలో మానసిక వ్యథతో పాటు మనోవైకల్యం వంటి సమస్యలు పెద్దగా లేవు. తీవ్రమైన మానసిక అనారోగ్యానికి ధ్యానానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనేదానిపై స్పష్టత లేదంటున్నారు. కొంతమందిలో ఎదురైన మానసిక సమస్యల ఆధారంగా మాత్రమే రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకుంటే ఈ కేసుల్లో ఎక్కువ మంది మనోవైకల్యంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీని ముప్పు ధాన్యం తర్వాత ఎక్కువగా ఉంటుందని బాధితుల అనుభావాల ఆధారంగా అంచనా వేస్తున్నారు రీసెర్చర్లు.

దీనికి సంబంధించి 2017లో మానసిక నిపుణులు.. రిలిజియస్ స్కాలర్ల బృందం ధ్యానంతో మానసిక సమస్యలకు ఎలా దారితీస్తుందనేదానిపై కూడా అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం 73 మంది పశ్చిమ బుద్ధిస్టులు మెడిటేషన్ ప్రాక్టిషనర్లు, నిపుణులను కూడా ఇంటర్వ్యూ చేశారు. దీని ఫలితాలు PLOS One అనే జనరల్‌లో ప్రచురించారు. అందులో 47శాతం మందిలో మతిభ్రమించినట్టుగా అనిపించగా.. 42శాతం మందిలో భ్రమతో బాధపడినట్టుగా గుర్తించారు.

మరో 62శాతం మందిలో నిద్రలేమి సమస్యలు, 82శాతం మందిలో భయం, ఆందోళన, కంగారు వంటి మానసిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్టు గుర్తించారు. వీరిలో 73శాతం మందిలో వారానికి ఈ సమస్యలు తగ్గిపోగా.. 17శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. వీరిందరిలో మానసిక రుగ్మతలకు కారణం.. ధ్యానమే అనడానికి కచ్చితమైన ఆధారాలు కోసం మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.