Managing stress for cardiac health : జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు గుండెకు చేటు చేస్తాయా ! దీని నుండి బయటపడేందుకు చిట్కాలు

రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది కీలకం. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి సహజ మూడ్ లిఫ్టర్‌లుగా తోడ్పడతాయి.

Managing stress for cardiac health : జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు గుండెకు చేటు చేస్తాయా ! దీని నుండి బయటపడేందుకు చిట్కాలు

stress for cardiac health

Managing stress for cardiac health : నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనలో చాలా మందికి ఒత్తిడికి గురవుతుంటారు. దాదాపు అందరూ ప్రతినిత్యం ఒత్తిడితోనే కలసి ప్రయాణం చేస్తున్నారు. ఇది సాధారణమే అయినప్పటికీ దీర్ఘకాలిక ఒత్తిడి మన ఆరోగ్యంపై, ముఖ్యంగా మన గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. GOQii ఇండియా ఫిట్ రిపోర్ట్ 22-23 ఏడాదికి సంబంధించి ఒత్తిడి,మానసిక ఆరోగ్యపై జరిపిన అధ్యయనం ప్రకారం, 24% మంది భారతీయులు ఒత్తిడితో సతమతమవుతున్నట్లు తేలింది. ప్రధానంగా ప్రస్తుత పనివిధానం, ఆర్థిక అస్థిరత కారణంగా ఒత్తిడి గురవుతున్నట్లు తేలింది. ఒత్తిడిని నుండి మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకోవలసిన చర్యల గురించి ఈ కధనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Health Benefits of Okra : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయ ఒక్కటి చాలు !

1. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం: మానసికంగా,శారీరకంగా జాగ్రత్తగా ఉండాలి. యోగా, ధ్యానం , ప్రకృతిలో గడపటం వంటివి చేయడం ద్వారా ఆనందం, విశ్రాంతిని అందించే కార్యకలాపాలను కొనసాగించాలి. స్వీయ-సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఒత్తిడి , శారీరక , మానసిక ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. యాక్టివ్‌గా ఉండటం : రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది కీలకం. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి సహజ మూడ్ లిఫ్టర్‌లుగా తోడ్పడతాయి. వేగంగా నడక, సైక్లింగ్ , స్విమ్మింగ్ వంటి వారానికి కనీసం 150 నిమిషాల మితమైన,తీవ్రత కలిగిన ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.

READ ALSO : Cinnamon Water Benefits : ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ నీరు తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండటంతోపాటు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది !

3. గుండెకు మేలు చేసే ఆహారాలు ; సమతుల్య ఆహారం ఒత్తిడిని తగ్గించటంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు , ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారంపై దృష్టి సారించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, పంచదార కలిగిన స్నాక్స్ , అధిక సోడియం వంటలు తగ్గించాలి.

మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం : మైండ్‌ఫుల్‌నెస్ , రిలాక్సేషన్ పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. శ్వాస వ్యాయామాలు, కండరాల వ్యాయామాలు, ధ్యానం వంటివి భావోద్వేగలను తగ్గిస్తాయి. మంచి నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి కీలకమైనది.

READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !

5. సమస్యలను సన్నిహితులతో పంచుకోవటం: స్నేహితులు , ప్రియమైన వారితో ముచ్చటించటం, ఒత్తిడితో కూడిన సమయాల్లో భావోద్వేగ సమయంలో వారికి పరిస్ధితి వివరించటం వంటివి చేయాలి. మీకు బాగా నమ్మకస్తులతో మీ భావాలను ,ఆందోళనలను పంచుకోవడానికి వెనుకాడరాదు. సమస్యలు గురించి మాట్లాడటం వల్ల కొన్ని సందర్భాల్లో పరిష్కారాలకు దారి దొరుకుతుంది.

ఇక చివరిగా ఒత్తిడి అనేది జీవితంలో ఒక సాధారణ భాగమని గుర్తుంచుకోవాలి. అలాగని అది మీ జీవితాన్ని నియంత్రించకూడదు. గుండె ఆరోగ్యానికి హాని కలిగించకూడదు. ఈ వ్యూహాలను రోజువారి దినచర్యలో అనుసరించటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని గుండెను రక్షించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.