Water : ఆందోళన నుండి ఉపశమనం కలిగించే… నీరు

సాధారణంగా ఎక్కువ నీరు త్రాగే వ్యక్తులు ఎక్కువ ప్రశాంతత, నీరు తీసుకోవడం తగ్గినప్పుడు ఆందోళనకరంగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

Water : ఆందోళన నుండి ఉపశమనం కలిగించే… నీరు

Water

Updated On : March 6, 2022 / 12:29 PM IST

Water : చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక దశలో ఆందోళన, భయం వంటివాటితో ఎక్కువగా బాధపడతారు. అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆందోళన సంబంధిత పరిస్థితిని కలిగి ఉన్నారు. ఇటీవలి కాలంలో 15-24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో అత్యధిక శాతం మంది ఆందోళనతో బాధపడుతున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రానురాను ఈ సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న పోషకాహార, మనో రోగచికిత్స రంగం ప్రధానంగా మన మానసిక ఆరోగ్యం, ఆహారాలు,పానీయాల ప్రభావాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఆందోళన తగ్గించటంలో నీటి వల్ల కలిగే ప్రయోజనంపై పరిశీలన జరిపినప్పుడు అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. మానవ శరీరంలో 60-80% నీరు ఉన్నప్పటికీ, చాలా మంది నీటిని ముఖ్యమైన పోషకంగా గుర్తించలేకపోతున్నారు. నీరు ఆందోళనకు సంబంధించిన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది.

వేసవి కాలంలో చల్లటి పానీయం అందించే చల్లదనాన్ని చాలామంది ఆస్వాదిస్తుంటారు. హైడ్రేషన్ అనేది ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావితం చేస్తుందని అనేక పరిశోధనల్లో నిర్ధారణైంది. డీహైడ్రేషన్‌తో కోపం, శత్రుత్వం, గందరగోళం మరియు ఉద్రిక్తత అలాగే అలసట వంటి ప్రతికూల భావోద్వేగాలు పెరుగుతున్నట్లు కనుగొనబడింది. ఒక అధ్యయనంలో తేలికపాటి డీ హైడ్రేషన్ కారణంగా చాలా మందిలో ఉద్రిక్తత, అలసట, ఆందోళన వంటి పరిస్ధితులను అధ్యయనకారులు గుర్తించినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

సాధారణంగా ఎక్కువ నీరు త్రాగే వ్యక్తులు ఎక్కువ ప్రశాంతత, నీరు తీసుకోవడం తగ్గినప్పుడు ఆందోళనకరంగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అధ్యయనం పాల్గొన్న వ్యక్తులకు ఎంత ఎక్కవనీరు అందిస్తే అంత ఎక్కవగా ప్రశాంతత, ఆనందాన్ని అనుభవించినట్లు గుర్తించారు. మరో అధ్యయనం ప్రకారం రోజుకు ఐదు గ్లాసుల అంతకంటే ఎక్కువ నీరు త్రాగే వ్యక్తుల్లో నిరాశ ,ఆందోళనకు గురయ్యే ప్రమాదం తక్కువగా ఉండగా వారితో పోల్చి చూస్తే రోజుకు రెండు గ్లాసుల కంటే తక్కువ నీరు తాగడం ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందని గుర్తించారు.

ఇటీవల పరిశోధకులు ఎలక్ట్రోలైట్‌లతో కూడిన నీరు సాధారణ నీటి కంటే ఆందోళనను నివారిస్తుందని కనుగొన్నారు. నిర్జలీకరణం, ఆందోళన మధ్య సంబంధాన్ని పిల్లలలో కూడా గమనించవచ్చు. డీహైడ్రేషన్ ప్రభావం నిద్రను సైతం ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ నిద్రలేమి పరిస్థితి ఆందోళనను మరింత తీవ్రతరం చేయటానికి దారి తీస్తుంది. ప్రతి శరీర పనితీరు నీటిపై ఆధారపడి ఉంటుంది. మెదడు కణజాలంలో 75% నీరు ఉన్నందున, డీహైడ్రేషన్ మెదడులో శక్తి ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెదడు నిర్మాణాన్ని మారి తద్వారా మెదడు పనితీరు మందగిస్తుంది. సరిగ్గా పనిచేయదు.

మన కణాలు నిర్జలీకరణ స్థితి ఆందోళనకు దారి తీస్తుంది. సెరోటోనిన్ అనేది ఒక న్యూరోట్రాన్స్మిటర్ అంటే మెదడు కణాల మధ్య ఒక రసాయన దూతగా చెప్పవచ్చు. ఇది మన మానసిక స్థితిని స్థిరీకరిస్తుంది. భావోద్వేగాలను నియంత్రిస్తుంది. నిర్జలీకరణ సమయంలో, మన మెదడులోకి సెరోటోనిన్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన రసాయనాలను పొందటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కేవలం అర లీటరు నీరు డీహైడ్రేట్ కావడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ కూడా పెరుగుతుంది, ఇది ఆందోళనతో సహా అనేక రకాల మానసిక రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది.

కాబట్టి, మొత్తం ఆహారం, శారీరక శ్రమ స్థాయిలు, నిద్ర నేపథ్యంలో నీరు తీసుకోవడం అన్నది ఎంతోముఖ్యం. మానసిక ఆరోగ్యానికి తోడ్పడే ముఖ్యమైన వాటిల్లో నీరు కూడా ఒకటిగా ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఆందోళనను ఎదుర్కొంటున్న వ్యక్తులు నీరు ఎక్కవగా తాగటం వల్ల వారి పరిస్ధితిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.