Cool Techniques: వారెవ్వా.. ఎండాకాలంలో మీ ఇంటిని కూల్ కూల్‌గా ఉంచే సింపుల్ టెక్నిక్స్ ఇవిగో..!
ఉదయం 11 గంటల తర్వాత ఇంట్లోకి ఎక్కువగా వేడిగాలులు వస్తుంటాయి. ఈ సమయంలో హీట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా కర్టెన్స్ వాడాలి.

Cool Techniques: ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నిప్పుల గుండంలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది జనాలకు. ఒకవైపు ఎండ వేడి, మరోవైపు తీవ్రమైన ఉక్కపోత.. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటిని చల్ల చల్లగా ఉంచుకోవడం ఎలా? దీనికి ఏమైనా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయా? అంటే.. అవుననే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మన ఇంట్లో మనం చేసే చిన్న చిన్న పనులు, తీసుకునే జాగ్రత్తల ద్వారా మన ఇంటిని ఎండాకాలంలోనూ కూల్ కూల్ గా ఉంచొచ్చని చెబుతున్నారు. ఇంటకీ ఆ సింపుల్ టెక్నిక్స్ లో ఏంటో తెలుసుకుందాం..
ఎండా కాలంలో మనం ఎంతగా ఏసీలు, కూలర్లు వాడినప్పటికీ న్యాచురల్ గా వచ్చే గాలి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. నేచురల్ గాలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే ఉదయం, రాత్రి సమయాల్లో చల్లని గాలులు ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం కిటీకీలు, ఇంటి ద్వారాలు ఆ సమయంలో సాధ్యమైనంత వరకు తెరిచి ఉంచాలి.
ఇక చెట్లు స్వచ్చమైన గాలిని ఇస్తాయి. కాబట్టి ఇంట్లో చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ ఉంచడం వల్ల ఇల్లు చాలా వరకు కూల్ అవుతుంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న గాలిని కూడా చెట్లు ప్యూరిఫై చేస్తాయి. తద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం 11 గంటల తర్వాత ఇంట్లోకి ఎక్కువగా వేడిగాలులు వస్తుంటాయి. ఈ సమయంలో హీట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా కర్టెన్స్ వాడాలి. దీంతో ఎండ, వేడి గాలులు అంతగా ఇబ్బంది పెట్టవు. ఇన్సులేటడ్ గ్లాస్ తో కూడిన కిటికీలు కూడా రూమ్ టెంపరేచర్ పెరగకుండా చూస్తాయి. దీనివల్ల ఏసీ, కూలర్ లేకపోయినా రూమ్ చల్లగా ఉంటుంది. ఇంట్లోకి ఎండ, వడగాలులు వచ్చే సమయానికి కిటికీలను కర్టన్స్ తో కవర్ చేసుకోవాలి.
ఇంట్లో ఏసీలు, కూలర్స్ ఉన్నప్పటికీ.. సీలింగ్ ఫ్యాన్స్ ఎవర్ గ్రీన్ అని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ ఫ్యాన్స్ చల్లటి గాలిని కిందకు పంపిస్తాయి. సీలింగ్ ఫ్యాన్స్ వేయడం వల్ల వేడిగాలులు దూరమై మన శరీరానికి చల్లని గాలులు తగులుతూ ఉంటాయి. అయితే, ఈ బెనిఫిట్స్ అన్నీ పొందాలంటే సరైన ఫ్యాన్లను ఎంచుకోవాలి. మార్కెట్ లో ఉండే రకరకాల ఫ్యాన్స్ లో ఎనర్జీ ఎఫీషియంట్ ఏది బాగుంటే దాన్ని కొనుగోలు చేయాలి. మంచి క్వాలిటీ ఫ్యాన్స్ ను బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొనుగోలు చేయాలి. నాణ్యమైన ఫ్యాన్స్ తో రూమ్ టెంపరేచర్ తక్కువగా ఉండి గది మొత్తం చల్లగా ఉంటుంది.
Also Read: ఎంపీగా ఓడిన కవితకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? కుటుంబపాలన విమర్శలను ఎలా చూస్తారు?
ఇక బాత్ రూమ్స్, కిచెన్స్ నుంచి వేడి రాకుండా ఉండాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ను వాడాలి. రూమ్ లోకి చల్లని గాలి రావాలంటే ఐస్ ముక్కలు లేదా చల్లని నీటిని ఫ్యాన్ గాలికి ఎదురుగా ఉంచండి. అంటే ఇంచు మించు సీలింగ్ ఫ్యాన్ కింద వాటిని ఉంచాలి. దీని వల్ల ఆ గాలి ఈ చల్లని ఐస్ లేదా నీటితో కలిసి మెల్లమెల్లగా చల్లని గాలిగా మారుతుంది. దీంతో రూమ్ లో చల్లని గాలి మొత్తం విస్తరిస్తుంది. క్రమంగా రూమ్ లోని వేడి గాలి బయటకు వెళ్లిపోయి రూమ్ అంతా చల్లని గాలి విస్తరిస్తుంది.
ఇక హౌస్ పైకప్పు లేదా గోడల బయటి భాగానికి కొన్ని రకాల పెయింట్స్ వేయడం ద్వారా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. ఇంటి గోడలకు తేలికపాటి రంగులు వేయిస్తే అవి వేడిని తక్కువగా పీల్చుకుంటాయి. అలాగే ఇంటి పైకప్పు లేదా బాల్కనీల్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం వల్ల ఇంట్లోకి వేడి గాలి ప్రవేశించకుండా జాగ్రత్త పడొచ్చు. అందంగా కనిపించడమే కాకుండా వేడి ప్రభావాన్ని తగ్గించడానికి కిటికీలకు తీగ మొక్కలు పెంచడం మంచిది. అవి వేడి నుంచి గదిని రక్షిస్తాయి. పచ్చదనంతో కూడిన కిటికీలు గాలి తేమను నిల్వ ఉంచి చల్లగా ఉంచుతాయి. ఇలా ఈ వేసవిలో వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరు ఇలాంటి చిట్కాలు పాటించాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.