Harish Rao Exclusive: ఎంపీగా ఓడిన కవితకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? కుటుంబపాలన విమర్శలను ఎలా చూస్తారు?

కోమటరెడ్డి బ్రదర్స్ ఉండొచ్చు, వివేక్ కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు. వాళ్లకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడిది?

Harish Rao Exclusive: ఎంపీగా ఓడిన కవితకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? కుటుంబపాలన విమర్శలను ఎలా చూస్తారు?

Updated On : April 26, 2025 / 9:36 PM IST

Harish Rao Exclusive: ఎంపీగా ఓడిన కవితకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారు? మీ కుటుంబసభ్యుడైన సంతోష్ కుమార్ ను రాజ్యసభ సభ్యుడిని చేశారు. ఇది కుటుంబపాలన కాదా? అంటూ అధికార పక్షం చేస్తున్న విమర్శలను ఏ విధంగా చూస్తారు? దీనికి మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన సమాధానం ఏంటి.. 10 టీవీ ఎక్స్ క్లూజివ్ విత్ హరీశ్ రావు.. ”పాతికేళ్ల గులాబీ”..

ప్రశ్న: తెలంగాణ యువతకు ఇచ్చిన ఉద్యోగాలు సరే. మీ కుటుంబంలో వచ్చిన ఉద్యోగాల గురించి చెప్పడం లేదు. కేసీఆర్, హరీశ్, కేటీఆర్ ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి వారికి పదవులు వచ్చాయి. ఆ తర్వాత కవితకు పదవి ఇచ్చారు. కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేశారు. మీ కుటుంబసభ్యుడైన సంతోష్ కుమార్ ను రాజ్యసభ సభ్యుడు చేశారు. దొడ్డిదారిన చేశారు. కుటుంబ పాలన అంటూ తీవ్రమైన విమర్శ వచ్చింది మీపై. దానికి ఏం చెప్పుకుంటారు?

హరీశ్ రావు..
”ఉద్యమంలో కుటుంబం గురించి ఎందుకు గుర్తుకు రాలేదు. ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో తెలీదు, ప్రభుత్వం వస్తుందో రాదో తెలీదు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి మేము కొట్లాడితే ఆరోజు కుటుంబం గుర్తుకు రాలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలు ఎవరు? రాజ్యసభకు వీళ్లను తీసుకోలేదా?

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదేంటి? కోమటరెడ్డి బ్రదర్స్ ఉండొచ్చు, వివేక్ కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు. వాళ్లకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడిది? మేము ప్రజల నుంచి వచ్చాం, ఉద్యమం నుంచి వచ్చాం.. ఆ రోజు రాష్ట్రం రానే రాదు, తెలంగాణ రానే రాదు, ఇది పాల పొంగు, ఇది నీటి బుడగ, అసలు ఇది ఉండే పార్టీ కాదే అని మాట్లాడారు.

ఆరోజుల్లో మా జీవితాలను లెక్క చేయకుండా మేము కేసీఆర్ నాయకత్వంలో పని చేసి రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రం సాధించిన మేము ప్రజల్లో నుంచి వస్తే దాన్ని తప్పుపడితే చరిత్ర క్షమించదు. అయినా, ఇవన్నీ రూల్డ్ ఔట్ అయ్యాయి. గెలుపు ఓటములను అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. కచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మేము కూడా ఆత్మవిమర్శ చేసుకుంటాం. ప్రజలకు నచ్చని విషయాలు గతంలో ఏవైనా చేసి ఉంటే వాటిని సరి చేసుకుంటాం. ప్రజల ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటాం.

Also Read: సిల్వర్ జూబ్లీ సభ వేదికగా గులాబీ గూటికి ఈ నేతలు తిరిగి వస్తున్నారా!?

ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన కొంత దుష్ప్రచారాన్ని నమ్మి ఉండొచ్చు. ఎందుకంటే నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. అలానే కాంగ్రెస్ కూడా మా మీద దుష్ప్రచారం చేసింది. ఏడాది తర్వాత ఇవాళ ప్రజలకు వాస్తవాలు నెమ్మదిగా అర్థం అవుతున్నాయి. 420 హామీలు ఇచ్చారు. ఏదీ అమలవుతున్న పరిస్థితి లేదు. కేసీఆర్ అమలు చేసిన పథకాలు (రైతుబంధు, బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, చేపల పంపిణీ) కూడా కొనసాగడం లేదు. జనాలు రియలైజ్ అవుతున్నారు. కేసీఆరే బాగుండే, బీఆర్ఎస్ పార్టీ బాగుండే అని ప్రజలు ఆలోచిస్తున్నారు” అని హరీశ్ రావు అన్నారు.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here