Natural Defense System : శరీర సహజ రక్షణ వ్యవస్ధ కోసం రోజువారీగా వీటిని తీసుకోండి!

తులసి, దాల్చిన చెక్క, నల్లమిరియాలు , శొంఠి వేసి డికాషన్ కాచుకుని రోజులో ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. 150 మిల్లీ లీటర్ల వేడి పాలలో అర టీస్పూన్ పసుపు వేసుకుని రోజులో రెండు సార్లు తీసుకోవాలి.

Natural Defense System : శరీర సహజ రక్షణ వ్యవస్ధ కోసం రోజువారీగా వీటిని తీసుకోండి!

The natural defense system and the normative self model

Updated On : December 21, 2022 / 9:30 PM IST

Natural Defense System : చలికాలం వైరస్ లు విజృంభిస్తున్న వేళ శరీర సహజ రక్షణ వ్యవస్ధ ను కాపాడుకోవటం చాలా అవసరం. ఇందుకోసం రోజువారి వంటకాల్లో జీలకర్ర, వెల్లుల్లి, అ్లం, ధనియాలు, పసుపు క్రమం తప్పకుండా వినియోగించాలి. ఇదే విషయాన్ని ఆయుర్వేదం సైతం చెబుతుంది.

శరీర సహజ రక్షణ వ్యవస్ధ కోసం ;

గోరు వెచ్చని నీటినే తీసుకోవాలి. రోజు అరగంట పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. వంటకాల్లో పసుపు , జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పక వాడుకోవాలి. వీటిని వాడుకోవటం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన బలవర్ధక ఆహారం తీసుకోవాలి. క్యారెట్, ఆకు కూరలు, కీరా, పండ్లు, కర్భూజ, తీసుకోవాలి. ద్రాక్ష, కివీ, కమలాలు, గుడ్లు, పాలు, సోయా, శనగలు, చిక్కుడు గింజలు వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

తులసి, దాల్చిన చెక్క, నల్లమిరియాలు , శొంఠి వేసి డికాషన్ కాచుకుని రోజులో ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. 150 మిల్లీ లీటర్ల వేడి పాలలో అర టీస్పూన్ పసుపు వేసుకుని రోజులో రెండు సార్లు తీసుకోవాలి. గొంతుమంట, పొడి దగ్గు ఉంటే ఉపశమనం కోసం పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకోవాలి. బెల్లం లేదా తేనెతో లవంగాల పొడి కలుపుకుని తీసుకోవాలి.