Covid Pandemic End : ఈ 4 విధాలుగా కరోనా మహమ్మారి అంతం కాబోతోంది. మరి ఇండియాలో ఎలా కట్టడికాబోతోంది?
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతమవుతుందా? వ్యాక్సినేషన్‌తో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా? అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతంకాబోతోంది?

The Covid Pandemic Will Likely End In One Of These Ways (1)
Covid Pandemic End one of these ways : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతమవుతుందా? వ్యాక్సినేషన్‌తో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా? అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతంకాబోతోంది? ఒకప్పటిలా మళ్లీ ప్రపంచమంతా సాధారణ జీవితంలోకి తిరిగి వస్తుందా? ఎన్ని మార్గాల్లో కరోనాను అంతం చేయొచ్చు అనేక ప్రశ్నలకు సమాధానం ఈ మార్గాల్లోనే దొరకే అవకాశం ఉందంటున్నారు పరిశోధక నిపుణులు. ఆ మంచి తరుణం చాలా అతి దగ్గరలోనే ఉందంటున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి వ్యాక్సినేషన్ ద్వారా అంతమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వైట్ హౌస్ విజన్ ప్లాన్ ప్రకారం.. జూలై 4 తేదీన జరిగే టపాసుల మోతతో అమెరికాలో కరోనా మహమ్మారి అంతమైపోతుందని భావిస్తోంది. ఒకవేళ మహమ్మారి కాలం ముగియకపోతే మాత్రం ఏళ్లపాటు వ్యాక్సిన్ షాట్లు తీసుకోవాల్సిందే అంటున్నారు. అమెరికాలో వచ్చే సోమవారం నాటికి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 80 మిలియన్ల మంది అమెరికన్లకు పూర్తి వ్యాక్సిన్ అందింది. మొదటి 100 రోజుల పాలనలో 200 మిలియన్ల షాట్ల లక్ష్యాన్ని అమెరికా ఇదివరకే చేరుకుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అది కూడా 8 రోజులు ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నట్టు పేర్కొన్నారు.
అమెరికాలో ఇండిపెండెన్స్‌డే నాటికి మహమ్మారి అంతం :
కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంకా సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్ అందించాల్సి ఉంది. అలాంటప్పుడు అమెరికా సహా ప్రపంచమంతా కరోనా మహమ్మారి అంతానికి ఎలా దగ్గరగా ఉన్నామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో వచ్చే ఇండిపెండెన్స్ డే నాటికి కరోనా మహమ్మారి అంతమై పోతుందని అంటున్నారు నిపుణులు. లేదంటే భవిష్యత్తులో వ్యాక్సిన్లపై ఆధారపడాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్లు ఎంతకాలం రక్షణ ఇవ్వగలవు? కొత్త కరోనా వేరియంట్లపై పూర్తి స్థాయిలో పోరాడగలవా? ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తవుతున్నాయి.
వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడం ద్వారా పూర్తి స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంతమంది తప్పకుండా మాస్క్ ధరించడంతో పాటు పూర్తి వ్యాక్సిన్ తీసుకునేంతవరకు ఐసోలేషన్ లో ఉంటున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి అంతమయ్యే మార్గాలను నిపుణులు వివరించారు. అవేంటో ఓసారి చూద్దాం..
వ్యాక్సినేషన్‌తోనే సాధారణ జీవితానికి చేరువుతాం :
వచ్చే జూన్ నాటికి అమెరికాలోని ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అందుతుంది. దాంతో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావొచ్చు. ఎన్ని వేరియంట్లు ఉన్నప్పటికీ కూడా. అప్పటినుంచి అమెరికా వాసులంతా స్వేచ్ఛగా సురక్షితంగా షాపింగ్ చేసుకోవచ్చు. ట్రావెల్ చేయొచ్చు.. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లొచ్చు.. మునపటి సాధారణ జీవితాన్ని మళ్లీ ప్రారంభించవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. సగానికి పైగా అమెరికన్లు ఒక షాటు తీసుకున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ రోజుకు మూడు మిలియన్లకు పైగా షాట్లు ఇచ్చారు. జూన్ చివరి నాటికి ప్రతి అమెరికన్ ఒక షాటు అందుకునే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ లో ఏప్రిల్ మధ్యనాటికి సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్ ఇమ్యూనిటీ సాధించవచ్చు.
సమ్మర్ ఆఖరిలో అంతా సర్దుకోవచ్చు :
అమెరికాలో మార్చిలో వ్యాక్సిన్ మొదలైనప్పటి నుంచి కొత్త కేసులు నర్సింగ్ హోం రెసిడెంట్లలో 96శాతానికి తగ్గిపోయాయి. 91శాతం మరణాలు డిసెంబర్ మధ్య నాటికి తగ్గాయి. నర్సింగ్ హోంలలో 4.8మిలియన్లకు పైగా మంది ఒక షాటును పొందారు. అమెరికాలో పూర్తి స్థాయిలో లేదా పాక్షికంగా అన్ని షాపులు, రెస్టారెంట్లు, యూనివర్శిటీలు, బార్లు మూసివేస్తే.. ఈ ఏడాది సమ్మర్ నాటికి కరోనా కేసులు భారీగా తగ్గిపోయి ఉండేవి. ఏది ఏమైనా సమ్మర్ నాటికి అంతా సర్దుకుంటుందని భావిస్తున్నామని ఇమ్యూనిలాజిస్ట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తట్టు, ఇతర టీకాల మాదిరిగానే చిన్నప్పుడే టీకాలు ఇవ్వడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రణలోకి తీసుకురావచ్చునని అంటున్నారు.
వైరస్‌ను నిర్మూలించలేం.. వ్యాప్తిని అరికట్టగలం:
భవిష్యత్తులో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం ద్వారా కరోనా మరణాల రేటుతో పాటు కొత్త వైరస్ కేసుల తీవ్రతను నెమ్మదిగా తగ్గించవచ్చు. అన్ని వయస్సుల వారికీ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందించినట్టయితే హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో చిన్నపిల్లలకు ముందుగానే టీకాలుగా ఇవ్వడం ద్వారా భావితరాలకు వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చునని అంటున్నారు. వైరస్ ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడదు కానీ, వ్యాప్తి కాకుండా అరికట్టగలమని నిపుణులు పేర్కొన్నారు. అప్పుడు మాత్రమే సాధారణ జీవితాన్ని ప్రారంభించగలమని అంటున్నారు.