Important Healthy Foods : శరీరానికి పోషణనిచ్చే ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !

బ్లూబెర్రీస్ లోని అధిక యాంటీఆక్సిడెంట్ , ఆంథోసైనిన్‌ల కారణంగా వాటిని శక్తివంతమైన సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. బ్లూబెర్రీ వినియోగం వల్ల హృదయనాళ ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. మెదడు మెరుగైన జ్ఞాపకశక్తితో చురుకుగా పనిచేస్తుంది.

Important Healthy Foods : శరీరానికి పోషణనిచ్చే ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !

Important Healthy Foods :

Updated On : June 20, 2023 / 7:38 AM IST

Important Healthy Foods : ఆరోగ్యం, సంరక్షణలో పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు ఉన్నప్పటికీ వాటిలో ఏవి ఆరోగ్యకరమైనవో గుర్తించడం చాలా కష్టం. మెరుగైన ఆరోగ్యం కోసం ఆహారంలో చేర్చుకోవాల్సిన 6 ఆరోగ్యకరమైన ముఖ్యమైన ఆహారాల జాబితా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

READ ALSO : Eating Junk Food : డిప్రెషన్ కు, జంక్ ఫుడ్స్ కు మధ్య ఉన్న లింక్ ఏమిటి?

1. క్వినోవా ;

ఇది ధాన్యంలా కనిపిస్తున్నప్పటికీ, శక్తివంతమైన పోషకమని చెప్పవచ్చు. క్వినోవా శాకాహారులు మంచి ఎంపిక. ఎందుకంటే ఇది ఫైబర్, గ్లూటెన్-ఫ్రీ తోపాటు మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగిఉన్న మొక్కల ఆహారాలలో ఇది ఒకటి. క్వినోవాలో క్వెర్సెటిన్ , కెంప్‌ఫెరోల్‌తో సహా అధిక స్థాయి ఫ్లేవనాయిడ్‌ల కారణంగా శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ-క్యాన్సర్ మరియు యాంటీ డిప్రెసెంట్ ఎఫెక్ట్‌లు ఉన్నాయి.

2. ఓట్స్ ;

ఓట్స్ అన్నది అద్భుతమైన అల్పాహార ఎంపిక, వోట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి క్యాలరీలు తక్కువగా ఉండటమే కాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి.

READ ALSO : Protein Rich Foods : ప్రతి శాఖాహారి తన ఆహారంలో చేర్చుకోవాల్సిన 5 ప్రొటీన్-రిచ్ ఫుడ్స్ !

3. వేరుశెనగ వెన్న(పీనట్ బటర్) ;

వేరుశెనగ వెన్న ఆరోగ్యకరమైన ఆహారంలో ఒక అద్భుతమైనది. దీనిని పీనట్ బటర్ గా పిలుస్తారు. దీనిలో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. పీనట్ బటర్
నాణ్యమైనది 100% కాల్చిన వేరుశెనగతో తయారు చేసినదానిని మాత్రమే తీసుకోవాలి. దీనిలో చక్కెర , ఉప్పు వంటివి కలపరాదు. ఎందుకంటే ఇందులో గుండె-ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్ కారణంగా, వ్యాయామం తర్వాత కండరాలకు ఇంధనం నింపడానికి తోడ్పడుతుంది.

4. బ్లూబెర్రీస్ ;

బ్లూబెర్రీస్ లోని అధిక యాంటీఆక్సిడెంట్ , ఆంథోసైనిన్‌ల కారణంగా వాటిని శక్తివంతమైన సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. బ్లూబెర్రీ వినియోగం వల్ల హృదయనాళ ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. మెదడు మెరుగైన జ్ఞాపకశక్తితో చురుకుగా పనిచేస్తుంది.

READ ALSO : Actress Praneetha: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో బాదం ఉండాల్సిందే

5. చియా విత్తనాలు ;

చియా విత్తనాల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఇనుము, కాల్షియం యొక్క ఆరోగ్యకరమైన మోతాదుల ద్వారా శక్తివంతమైన పోషకాలు అందుతాయి. చియా సీడ్స్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని అణచివేయడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచే అనుభూతిని కలిగిస్తుంది.

6. ఆకుకూరలు ;

బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరలు విటమిన్ ఎ, సి, ఇ , కె ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. వీటిలో డైటరీ ఫైబర్, ఫోలేట్ మరియు ఐరన్ , కాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆకు కూరలను రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు , క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.

READ ALSO : Effects of Smoking : చర్మం, జుట్టు , కంటి ఆరోగ్యంపై ధూమపానం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?

7. ఆపిల్ సైడర్ వెనిగర్

సేంద్రీయ ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ప్రోబయోటిక్ బ్యాక్టీరియా , ఎంజైమ్‌లు జీర్ణక్రియ, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. ఎసిటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ ఆమ్లం జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. దంతాలు , కడుపు లైనింగ్‌ను రక్షించుకోవచ్చు.

ఈ సూపర్ ఫుడ్స్ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఆహారాలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి సహాయపడతాయి. శరీరాన్ని ఆరోగ్యపరమైన ప్రమాదాల నుండి కాపాడతాయి.