Lose Weight : బరువు తగ్గాలంటే.. అనుసరించాల్సిన 5 ఆహార నియమాలు
రాత్రిపూట ఎక్కువ తింటే ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సాయంత్రం వేళల్లో తేలికగా తినడం మంచిది.

Lose Weight (1)
Lose Weight : బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో చాలా మందిని వివిధ రకాల సమాచారం గందరగోళానికి గురిచేస్తుంది. కొంతమంది బరువు తగ్గటానికి రాత్రి భోజనం మానేయమని సూచిస్తుంటారు. అంతేకాకుండా ఉపవాసాలు ఉండటం మేలని సూచిస్తుంటారు. అయితే వాస్తవానికి ఇలా చేయటం వల్ల శరీరంలో శక్తి సన్నగిల్లిపోయి వివిధ రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రాత్రి భోజనం చేసినా, సూర్యాస్తమయం తర్వాత తక్కువ కేలరీలు తీసుకున్నా, రాత్రిపూట భోజనం మానేసినా బరువు తగ్గించుకోవటం లో పెద్దగా ప్రభావం చూపవు. ఇలా చేయటం వల్ల బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడానికి బదులుగా నెమ్మదింప చేస్తాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే తప్పనిసరిగా అనుసరించాల్సిన 5 ఆహార మార్గదర్శకాలు మీకోసం…
1. భోజనం చేయటం మానేయకండి ; బరువు తగ్గాలనుకునే వారికి అతి ముఖ్యమైన సలహా ఏటంటే భోజనం మానేయడం అనేది సరైనదికాదు. భోజనం మానేటం వల్ల త్వరగా బరువు తగ్గుతారన్నది ఏమంత శ్రేయస్కరమైనది కాదు. దీనివల్ల ఆకలి అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో మోతాదుకు మించి ఎక్కువగా తినే అవకాశాలు ఉంటాయి. ఎక్కవమొత్తంలో ఆహారం తీసుకోవటం వల్ల అదనపు మొత్తం కొవ్వు నిల్వలు శరీరంలోకి చేరతాయి. దీని వల్ల బరువు తగ్గడం సంగతి పక్కనపెడితే బరువు పెరుగే ఛాన్స్ ఉంటుంది.. అందుకే రోజులో ఏ ఒక్క పూటైనా భోజనం మానుకోవాలన్న ఆలోచన మాత్రం చేయకపోవటం మంచిది.
2. భోజనానికి ముందు స్నాక్స్ తినండి ; ఉదయం అల్పాహారం తరువాత మధ్యాహ్నం భోజనానికి మధ్యలో స్నాక్స్ తీసుకోవటం మంచిది. అలాగే రాత్రి భోజనానికి ముందు మద్యాహ్న భోజనం తరువాత మధ్యస్ధ సమయంలో స్నాక్స్ తీసుకోవాలి. భోజనానికి ముందు ఆకలిగా ఉంటే ఆరోగ్యానికి మేలు కలుగించే చిరుతిండి మితంగా తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి ఇలా రెండు భోజనాలకు మధ్య వేచి ఉండకుండా, మధ్యలో ఏదైనా తినటం వల్ల భోజన సమయంలో ఆహారాన్ని అధికంగా తీసుకోవటాన్ని తగ్గించుకోవచ్చు.
3. ఆహారం తినే సమయంలో ఇతర వ్యాపకాలు వద్దు ; బరువు తగ్గటానికి ప్రయత్నించే వారు సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి భోజనం సమయంలో టివిలు, సెల్ ఫోన్ లు చూస్తూ తినేప్రయత్నం చెయ్యవద్దు. ఎందుకంటే పరధ్యానంలో మోతాదుకు మించి అధికంగా ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎక్కవ మోతాదు ఆహారం కాస్త శరీరంలో కొవ్వులు చేరటానికి ఆస్కారం కలిగిస్తుంది. ఆహారం తీసుకునే సమయంలో దృష్టి మొత్తం ఆహారంపైను ఉంచటం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయం చేస్తుంది.
4. రాత్రి మితమైన ఆహారం మేలు ; రాత్రిపూట ఎక్కువ తింటే ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సాయంత్రం వేళల్లో తేలికగా తినడం మంచిది. ఇది మీ శరీరాన్ని ఇతర శారీరక కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి ,జీవక్రియను నియంత్రించడానికి తగినంత సమయాన్నికేటాయించినట్లవుతుంది.
5. మోతాదు మించి తినొద్దు ; అడపాదడపా ఉపవాసం చేస్తున్నా, రాత్రి భోజనం చేయకుండా ఉదయం వరకు ఉపవాసం ఉండవలసి వచ్చినా తక్కువ కేలరీల ఆహారం తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఉపవాసాల తరువాత ఆకలి అధికంగా కలగుతుంది. ఈసందర్భంలో భోజనం, స్నాక్స్ ను ఎక్కవగా తినాలన్న ఆసక్తి పెరుగుతుంది. అందువల్ల ఇలాంటి సందర్భాల్లో తక్కువ కేలరీల ఆహరాన్ని తీసుకోవటం మాత్రం మర్చి పోకూడదు.